S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/13/2018 - 22:08

హైదరాబాద్, మార్చి 13: కాగితపువుడ్ ప్లాంటేషన్‌ను సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటుధరలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిసి పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ ఐటి డివిజన్ సివోవో వాడిరాజ్ కులకర్ణి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపెనీ మిల్లుకు తమ పంట ఉత్పత్తులను సరఫఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోనుగోలు ఆర్డర్‌ను రైతులకు నేరుగా విడుదల చేస్తామన్నారు.

03/13/2018 - 22:07

హైదరాబాద్, మార్చి 13: హైదరాబాద్ శివార్లలో రెండు లాజిస్టిక్ పార్కుల నిర్మాణం వేగవంతమైంది. దీని వల్ల ఒక కోటి జనాభాతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌లో బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలను నియంత్రించవచ్చును. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లాజిస్టిక్‌పార్కులు బాట సింగారం, మంగళపల్లి వద్ద ఏర్పాటవుతున్నాయి. గత అక్టోబర్ నెలలో లాజిస్టిక్‌పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.

03/13/2018 - 03:45

హైదరాబాద్, మార్చి 12:. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన అలజడిలో కంటికి గాయం అయిన మండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు సరోజని దేవి ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. సోమవారం ఉదయం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేస్తుండగా అడ్డుతగిలిన కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కాగా వారిని మార్షల్స్ అడ్డుకోవడంతో మైక్‌లను గవర్నర్ వైపుకు విసరగా అది స్వామిగౌడ్ కంటికి తగిలింది.

03/13/2018 - 03:42

హైదరాబాద్, మార్చి 12: ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుని అరాచకం సృష్టించారని రాష్ట్ర నీటి పారుదల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడితో కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్‌కు గాయం కావడం కాదు ప్రజాస్వామ్యానికే గాయమైందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

03/13/2018 - 03:47

హైదరాబాద్, మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఏసి) నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం మినహాయించి మొత్తం 11 వర్కింగ్ దినాలు సభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ నెల 15న శాసనసభ, శాసనమండలి ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి పద్దులపై చర్చ ముగిసిన అనంతరం 27న ద్రవ్య వినిమియ బిల్లును ఆమోదించాలని బిఏసి నిర్ణయించింది.

03/13/2018 - 03:32

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు సోమవారం చివరి తేదీ కావడంతో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టిఆర్‌ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మొత్తంగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

03/13/2018 - 03:20

హైదరాబాద్, మార్చి 12: రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తానని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కమినర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.

03/13/2018 - 03:17

హైదరాబాద్, మార్చి 12: అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిందని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్దాలను చెప్పించారని, ప్రసంగంలో ప్రాధాన్యత అంశాలను చేర్చకుండా,ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమైన నిరుద్యోగ సమస్యతో పాటు ముస్లిం, దళిత రిజర్వేషన్లపై గవర్నర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.

03/13/2018 - 03:17

హైదరాబాద్, మార్చి 12: కాంగ్రెస్ సభ్యులు కొందరు సభకు మద్యం సేవించి వచ్చి గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్‌ను లక్ష్యంగా దాడికి తెగబడ్డారని టిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. మద్యం మత్తులో సరిగ్గా నిలబడలేక ఒక సభ్యుడు సిఎల్‌పి నేత జానారెడ్డిపై తూలిపడగా ఆయన సభ నుంచి బయటికి వెళ్లిపోయారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

03/13/2018 - 03:16

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ఉభయ సభల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగం అబద్దాల పుట్ట అని బిజెపి శాసనసభా పక్ష నేత జి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఉప నాయకుడు చింతల రామచంద్రారెడ్డిలు వ్యాఖ్యానించారు.

Pages