S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/06/2016 - 18:02

హైదరాబాద్: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నల్సార్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన జస్టిస్ ఠాకూర్‌తో
రాజ్‌భవన్‌లో కేసీఆర్ భేటీ సందర్భంగా హైకోర్టు విభజన అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

08/06/2016 - 17:47

హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో 3 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గజ్వేల్‌, హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలోని సభా ప్రాంగణాలను ఎన్‌ఎస్‌జీ అధికారులు పరిశీలించారు. బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. 8 ప్రాంతాల్లో వాహనాలు మళ్లించనున్నారు.

08/06/2016 - 15:34

నల్లగొండ : నాగార్జునసాగర్ వరద కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వేములపల్లి, తిప్పర్తి మండలాలకు చెందిన సుమారు 100 మంది రైతులు నార్కట్‌పల్లి - అద్దంకి రహదారిపై మాడుగులపల్లి వద్ద శనివారం రాస్తారోకో చేశారు. వరద కాల్వ పనులు ఆగిపోవటంతో ఆరు గ్రామాలకు సాగు నీరు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గంటసేపు కొనసాగిన ఈ ఆందోళనతో పెద్ద సంఖ్యలో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.

08/06/2016 - 15:32

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడంలో రైతులు పెట్టిన విషం గుళికలు తిని 40 జింకలు చనిపోయాయి. మొక్కజొన్న పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు కొందరు రైతులు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి.

08/06/2016 - 14:47

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-3 పరీక్ష విధివిధానాలు, పూర్తి షెడ్యూల్‌ వివరాలతో ఈనెల 8న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్‌-3 నిర్వహణ కమిటీ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో శనివారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

08/06/2016 - 14:02

హైదరాబాద్: కృష్ణా పుష్కరాల సందర్భంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు.

08/06/2016 - 14:02

హైదరాబాద్: పంజగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరి మృతికి సంబంధించిన కేసులో నిందితుడు శ్రావెల్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించడం ఇది రెండోసారి. కేసు తీవ్రత దృష్ట్యా శ్రావెల్‌కు బెయిల్ ఇవ్వరాదని, బెయిల్ ఇస్తే అతను విదేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

08/06/2016 - 14:01

హైదరాబాద్: నగరంలోని చింతల్‌లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నిర్మించిన రెండు భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం సీజ్ చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ భవనాల్లో ప్రస్తుతం రెండు కార్పొరేట్ కళాశాలలు నడుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భవనాలను ఎమ్మెల్యే గౌడ్ నిర్మించారని ఆయన సమీప బంధువులు కోర్టులో పిటిషన్ వేశారు.

08/06/2016 - 11:42

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

08/06/2016 - 11:36

హైదరాబాద్: పంద్రాగస్టు వేడకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.అక్టోపస్ బృందాలు, సీఐఎస్ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు ఎయిర్‌పోర్టులో మోహరించారు.

Pages