S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/10/2018 - 05:28

హైదరాబాద్, మార్చి 9: అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగిఉన్న దేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విధానాలు, పద్ధతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణలు తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు.

03/10/2018 - 05:26

హైదరాబాద్, మార్చి 9: ‘నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నా చావు, పుట్టుక తెరాసలోనే. కేసీఆర్ మాటే నా బాట. త్యాగాలు తప్ప ద్రోహం తెలియదు’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వెంటనే స్పందించి దోషులను పట్టుకొని జైలుకు పంపించాలని డీజీపీని కోరినట్టు మంత్రి తెలిపారు.

03/10/2018 - 05:24

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌ను స్పూర్తిగా తీసుకుని ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ జేఏసి సన్నద్ధం కావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మాట, ఆట, పాట పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలన్న జెఏసి అభ్యర్థనను నగర సెంట్రల్ జోన్ డీసీపీ తిరస్కరించారు.

03/10/2018 - 05:23

హైదరాబాద్, మార్చి 9: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నిర్ణయించింది. ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

03/09/2018 - 03:54

హైదరాబాద్, మార్చి 8: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు పార్టీలూ పాపాల పుట్ట అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ రాజకీయ జీవి తం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీ నుం డని ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీల్లో మహిళలకు మూడో వంతు అవకాశాలు కల్పిస్తూ, వారిని రాజకీయంగా అభివృద్ధి చెందేలా చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు.

03/09/2018 - 03:53

హైదరాబాద్, మార్చి 8: ఈ నెల 10వ తేదీన ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహణకు అనుమతించాలన్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చేసిన అభ్యర్ధనను నగర పోలీసులు తిరస్కరించారు.

03/09/2018 - 03:52

బాసర, మార్చి 8: బాసర అమ్మవారి సన్నిధిలో గురువారం భక్తుల సందడి నెలకొంది. గురువారం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిచెంత అక్షరాభ్యాస పూజ లు జరిపించేందుకు భక్తులు, చిన్నారులు ఒక్కరోజు ముందుగానే తరలివచ్చారు. ఉదయం నుండి 11 గం టల వరకు ముహూర్తబలం ఉండటంతో ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలు భక్తులు, చిన్నారులతో కిటకిటలాడాయి.

03/09/2018 - 03:49

వరంగల్,మార్చి 8: వరంగల్ నిట్ కళాశాలకు స్ప్రింగ్ స్ప్రీ శోభ సంతరించుకుంది. మూడు రోజుల పాటు జరిగే స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను గురువారం రాత్రి వరంగల్ పోలీసు నగర కమిషనర్ జి.సుధీర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంలా కొనసాగుతున్న నిట్ కళాశాల ప్రతిష్టను మరింత పెంచేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు.

03/09/2018 - 03:47

మహబూబ్‌నగర్, మార్చి 8: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేతంలోని కోనేరులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణం ఏనుగొండలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం స్వామివారిని దర్శించుకునేందుకు బయలుదేరారు.

03/09/2018 - 03:41

నల్లగొండ, మార్చి 8: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయం మేరకు యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవస్థానం అద్భుత దివ్యక్షేత్రంగా నిర్మించేందుకు సాగుతున్న పనుల్లో తలెత్తిన వాస్తు దోషాల సవరణ దిశగా వైటిడిఏ తన నిర్మాణ డిజైన్లను మార్చుకుంటూ పనులను ముందుకు దూకిస్తోంది.

Pages