S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2018 - 02:50

సీలేరు, మార్చి 8: మహిళలపై జరుగుతున్న అకృత్యాలను సంఘటితంగా ప్రతిఘటించాలని మావోయిస్టు పార్టీ ఆంధ్రా, ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ పిలుపునిచ్చింది. గురువారం ఏవోబీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈవేడుకలకు సరిహద్దు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు.

03/09/2018 - 02:50

హైదరాబాద్, మార్చి 8: భాషపై పట్టు సాధించాలంటే బోధన పద్ధతులు, అభ్యసన పద్ధతులపై పట్టు ఉండాలని, అదే మూలమని ఇంగ్లీషు, విదేశీ భాషల యూనివర్శిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. జపాన్ భాషలో విద్యా బోధన పద్ధతులు అంశంపై గురువారం నాడు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

03/09/2018 - 02:49

హైదరాబాద్, మార్చి 8: వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారంపై సదస్సును 9వ తేదీ సాయంత్రం గగన విహార్‌లోని ఐసిఎడిఆర్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్, హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. సదస్సులో ప్రాంతీయ కేంద్రం కార్యదర్శి జెఎల్‌ఎన్ మూర్తి ప్రధాన ప్రసంగం చేస్తారు.

03/09/2018 - 04:31

హైదరాబాద్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని దేశంలోని 12 నగరాల్లో నిర్వహించినట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్ధ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పదివేల మంది మహిళలు పాల్గొన్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 18 మిలియన్ల నూతన ద్విచక్రవాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి.

03/09/2018 - 03:10

హైదరాబాద్, మార్చి 8: వ్యవసాయ విస్తరణ నైపుణ్యం కోసం యువతకు 25 రోజుల పాటు శిక్ష ణా కార్యక్రమం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. విశ్వవిద్యాల యం పరిధిలోని విస్తరణ విద్యా సంస్థ (ఈఈఐ) ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వ్యవసాయానికి సంబంధించిన అనేక కీలక అంశాల్లో నైపుణ్యతా శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

03/08/2018 - 22:11

హైదరాబాద్, మార్చి 8: కరీంగర్, వరంగల్ (అర్బన్), జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 155 మహిళా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017-18 సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఉపాధిహామీ పథకం కింద 155 మహిళా భవనాలను నిర్మించేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు.

03/08/2018 - 22:09

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్ర సమన్వయ సమితి డైరెక్టర్ మరియు చైర్మన్‌గా పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గత నెల 25 న జరిగిన రైతు సమన్వయ సమితుల సమావేశంలో అనధికారికంగా ప్రకటించిన విషయం గమనార్హం.

03/08/2018 - 22:08

హైదరాబాద్, మార్చి 8: వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పిజి) పూర్తి చేసిన విద్యార్థులు ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయాలన్న నిబంధనను తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా గురువారం ప్రకటన జారీ చేస్తూ, పిజి వైద్య విద్యార్థులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

03/08/2018 - 22:05

హైదరాబాద్, మార్చి 8: ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌లో లెక్కలన్నీ అవాస్తవాలేనని, నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సాధించిందేమీ లేదని వైకాపా ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి రాష్ట్రానికి సంబంధించి సొంత ప న్ను రూ.65,603 కోట్లు, గత ఏడాది రూ.52,715 కోట్లని, ఐదు వేల రెవెన్యూ రాబడి ఎక్కువ చూపుతున్నారని చెప్పారు.

03/08/2018 - 22:04

హైదరాబాద్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని దేశంలోని 12 నగరాల్లో నిర్వహించినట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్ధ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పదివేల మంది మహిళలు పాల్గొన్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 18 మిలియన్ల నూతన ద్విచక్రవాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి.

Pages