S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/30/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలో మీటర్లకు చేరుకున్న సందర్భంగా, జగన్‌కు సంఘీభావంగా ఆ పార్టీ నాయకులు హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్వర్యంలో ‘వాక్ విత్ జగన్’ పేరిట లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి పెద్దమ్మ గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు.

01/30/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 29: బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి టోకరా వేసిన నలుగురు అంతర్ రాష్ట్ర నేరగాళ్లలో ఇద్దరిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించి నగర సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/30/2018 - 03:55

వరంగల్, జనవరి 29: మేడారం జాతర కోసం మద్యం వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా భారీమొత్తంలో మద్యం స్టాకు డంప్ చేసారు. జాతర ప్రాంతంలో పెద్దమొత్తంలో బెల్టుషాపులు ఏర్పాటుచేసి వాటి ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జాతర మొదలవకముందే మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

01/30/2018 - 03:47

హైదరాబాద్, జనవరి 29: వచ్చే విద్యాసంవత్సరం నుండి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుండి ఇంటర్ వరకూ అమలుచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.అన్ని స్థాయిల్లో విద్యార్ధులకు ఇబ్బంది కలుగని రీతిలో తెలుగు భాషను ఆసక్తికరంగా, స్కోరింగ్ సబ్జెక్టుగా తీర్చిదిద్దాలని అన్నారు.

01/30/2018 - 03:45

హైదరాబాద్, జనవరి 29: ‘ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగంగా ఎండగడుతున్నందున నన్నూ చంపుతారేమో..!’ అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు అనుమానం వ్యక్తం చేశారు. నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్‌ను కిరాతకంగా హత్య చేయించారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓటమి భయంతో ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తున్నదని విహెచ్ విమర్శించారు.

01/30/2018 - 03:43

హైదరాబాద్, జనవరి 29: ‘ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు అండగా ఉన్నారు..’ అని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో రమణ అధ్వర్యంలో ‘పల్లెపల్లెకు తెలుగు దేశం’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది.

01/30/2018 - 03:42

హైదరాబాద్, జనవరి 29: విజ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర మత్స, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జంట నగరాల్లోని గ్రంథాలయాల అధికారులతో మంత్రి తలసాని సోమవారం సమావేశమయ్యారు.

01/30/2018 - 03:42

హైదరాబాద్, జనవరి 29: ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు ఎథిక్స్- హ్యుమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎథిక్స్- హ్యుమన్ వాల్యూస్ పరీక్షకు 4,61,748 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,47,091 మంది హాజరయ్యారు. 14,657 మంది గైర్హాజరయ్యారు. ఇక ఎన్విరాన్‌మెంటల్ పరీక్షకు 4,61,844 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,46,804 మంది హాజరయ్యారు. 15,040 మంది గైర్హాజరయ్యారు.

01/30/2018 - 03:41

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 29: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధించేందుకు పార్టీలకు అతీతంగా సమిష్టిగా పోరాడుదామని అఖిలపక్ష సమావేశం అఖిలపక్షం తీర్మానించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన వర్గీకరణ చట్టబద్ధత అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది.

01/30/2018 - 03:39

హైదరాబాద్, జనవరి 29: ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ (డిజిపి) ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. స్నేహపూర్వక పోలీసు విధానాలను అనుసరిస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. తాము అందిస్తున్న సేవలు, జవాబుదారీతనం పట్ల ప్రజలు ఏరకంగా స్పందిస్తున్నారనే అంశంపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కూడా చాలా అవసరమని అన్నారు.

Pages