S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/29/2018 - 03:30

హైదరాబాద్, జనవరి 28: ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, దేవాలయ, వక్ఫ్ భూముల్లో కట్టుకున్న ఇళ్ళపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ విభాగం వంద శాతం పెనాల్టీ విధించడం భావ్యం కాదని ‘పట్నం’ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు కె. వేణుగోపాల రావు, ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు తెలిపారు.

01/29/2018 - 03:29

హైదరాబాద్, జనవరి 28: డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతైతే విస్తరిస్తోందో అదే స్థాయిలో సైబర్ నేరాలు, మోసాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది సైబర్ నేరాలు, మోసాలే. ఆ దేశం ఈ దేశం అంటూ ఏదీ లేదు, అన్ని దేశాలకు సైబర్ క్రైం షాకిస్తోంది. ఇంటర్నెట్ ఆధారంగా సైబర్ చోరులు ఎక్కడో ఉండి, మరెక్కడి నుంచో మోసాలకు పాల్పడుతున్నారు.

01/29/2018 - 03:28

హైదరాబాద్, జనవరి 28: నేటి నుంచి ప్రారంభం కానున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో గళాన్ని పెంచాలని టిఆర్‌ఎస్ భావిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి సమావేశాల్లో కాస్త కటువుగానే వ్యవహరించాలని నిర్ణయించినట్టు టిఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం. అన్ని అంశాల్లో కేంద్రానికి స్నేహహస్తాన్ని అందించినా అటు నుంచి ఆశించిన మేరకు సహకారం కొరవడిందని టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి నెలకొంది.

01/29/2018 - 03:28

హైదరాబాద్, జనవరి 28: పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ హైదరాబాద్ (జూబ్లిహిల్స్) లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న బస్తి దవాఖానలో ఒక పాపకు పల్స్‌పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. ఇందుకోసం 22,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

01/29/2018 - 03:26

హైదరాబాద్, జనవరి 28: రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్తు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిందని బిజెపి జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ తెలిపారు.

01/29/2018 - 03:26

హైదరాబాద్, జనవరి 28: బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై నిగ్గు తేల్చేందుకు రాష్డ్ర డిజిపికి 10 రోజుల గడువు ఇస్తున్నామని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి.హనుమంత రావు అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ అయ్యప్ప భక్తుడని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అయ్యప్ప పామలు మీ మెడకు చుట్టుకుంటుందని, ఈ పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు తగులుతుందని ఆయన అన్నారు.

01/29/2018 - 03:25

హైదరాబాద్, జనవరి 28: ‘్భష్మ ఏకాదశి’ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఆదివారం ‘విష్ణు సహస్రనామార్చన’ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 12 గంటల పాటు విష్ణుసహస్ర నామార్చన జరగగా, మరికొన్ని ఆలయాల్లో ఆరు గంటలు, ఇంకొన్ని ఆలయాల్లో మూడు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు ప్రతి ఆలయంలో కనీసం గంటపాటైనా నామార్చన జరిగింది. ఈ రోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు.

01/28/2018 - 04:01

వరంగల్, జనవరి 27: మేడారం జాతరలో విధులు నిర్వహించటం ఒక అదృష్టంగా భావించి ప్రతి అధికారి, ఉద్యోగి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని శాసనసభా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సూచించారు. మరో నాలుగురోజుల్లో మేడారం సమ్మక్క-సారల మ్మ ప్రాంగణం కోటిమందితో మహానగరంగా మారబోతోందని చెబుతు అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు దర్శనం సులభంగా లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

01/28/2018 - 03:59

హైదరాబాద్, జనవరి 27: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హైదరాబాద్ నగర పాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాసా రాజశేఖర్ (29), రాసా రమాకాంత్ (25)లు అమాయకులను నమ్మించి డబ్బు గుంజుతున్నారు. వీరి ఉచ్చులో ఏడుగురు బాధితులు చిక్కుకుని భారీగా డబ్బు చెల్లించారు.

01/28/2018 - 03:57

హైదరాబాద్, జనవరి 27: మద్యం సేవించి వాహనాలు నడిపిన 94 మందికి జైలుశిక్ష పడిందని నగర ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 26 వరకు 493 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఒకరికి 20 రోజులు, మరొకరికి 10 రోజులు, మరొకరికి 6 రోజులు, నలుగురికి 5 రోజులు, ఏడుగురికి నాలుగు రోజులు, 22 మందికి 3 రోజులు, 58 మందికి రెండు రోజులు జైలు శిక్ష పడిందని తెలిపారు.

Pages