S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/22/2016 - 06:38

హైదరాబాద్, జూన్ 21: రామగుండంలో నిర్మించతలపెట్టిన ఎన్టీపిసి 4000 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ ప్లాంట్ నుంచి తెలంగాణ డిస్కాంలు 1600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై సమర్పించిన ముసాయిదా ఒప్పందాలను పునస్సమీక్షించి, సవరించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రెండు డిస్కాంలు, ఎన్టీపిసి తాజాగా సవరించిన ముసాయిదా ప్రతులు ఇవ్వాలని ఆదేశించింది.

06/22/2016 - 06:37

హైదరాబాద్, జూన్ 21: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో గణనీయంగా సీట్ల కోత విధించడంపై యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల కోతతో సతమతమవుతున్న యాజమాన్యాలకు ఫీజుల్లో కూడా కోత పడటం జీర్ణించుకోలేకపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో పరిస్థితులకు అనుగుణంగా చూస్తే కనీస ఫీజు 35వేల రూపాయలు సైతం ఖరారు చేసే అవకాశం లేదని ఎఎఫ్‌ఆర్‌సి స్పష్టం చేయడంతో కాలేజీల యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

06/22/2016 - 06:36

సంగారెడ్డి, జూన్ 21: వ్యవసాయ రంగానికి కావల్సిన సాగునీటిని అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు నిర్వాసితులను రెచ్చగొడుతున్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉద్ఘాటించారు.

06/22/2016 - 06:36

హైదరాబాద్/గోదావరి ఖని, జూన్ 21: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండవ యూనిట్‌లో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, జూలై రెండో వారంలో 600 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకురావాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ఆదేశించారు.

06/21/2016 - 18:06

హైదరాబాద్: నగర శివారులోని ఉప్పర్‌పల్లి కోర్టులో ఇద్దరు రిమాండ్ ఖైదీలను హాజరుపరిచి తిరిగి తీసుకుని వెళ్తుండగా ఇద్దరు ఖైదీలు ఆకస్మింగా పోలీసులపై దాడి చేసి పలాయనం చిత్తగించారు. అయితే, పోలీసులు పరుగుపెట్టి ఓ ఖైదీని మాత్రం పట్టుకోగా మరో ఖైదీ మాత్రం పరారయ్యాడు. చోరీలు, అత్యాచారం కేసులో యుపికి చెందిన జీషన్ పాల్, అరవంద్ శర్మ అనే దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.

06/21/2016 - 18:04

నిజామాబాద్: తెలంగాణ సర్కారు సుమారు 42వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న నిధుల స్వాహాపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, నిధుల దోపిడీకి తాము అంగీకరించమన్నారు.

06/21/2016 - 14:57

కరీంనగర్: రాజకీయ స్వార్థంతోనే తెరాస పాలకులు జిల్లాలను విభజిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో అన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా, హేతుబద్ధంగా జిల్లాల ఏర్పాటు జరగాలన్నారు. కొత్త జిల్లాల విషయంలో ప్రజల మనోభావాలను తెలియజేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన తెలిపారు.

06/21/2016 - 14:57

నల్గొండ: టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పడుతున్న గొడవలు చూడలేకే తాను కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరానని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆ ఇద్దరి వల్లా పార్టీకి చేటు కలుకుతోందన్నారు. అందరికీ నీతులు చెప్పే ఉత్తమ్‌కుమార్ రెడ్డి పులిచింతల నిర్వాసితుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

06/21/2016 - 14:56

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ రూపశిల్పి దివంగత జయశంకర్ ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ప్రజల మద్దతుతో ఉద్యమం నడిపి తెలంగాణను సాధించామని, ఇపుడు ఆ ప్రజల ఆశలను తీర్చేందుకు బంగారు తెలంగాణను సాధించే ప్రయత్నంలో ఉన్నామని కెసిఆర్ అన్నారు.

06/21/2016 - 14:52

హైదరాబాద్: అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు ప్రమాదాల్లో చిక్కుకుని మరణించారు. వారాంతపు సెలవుల్లో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి వీరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన నంబూరి శ్రీదత్త ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించాడు.

Pages