S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/27/2018 - 03:30

హైదరాబాద్, జనవరి 26: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని గద్దె దించుతామని టి.టిడిపి నేతలు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రమణ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 68 సంవత్సరాలు దాటినా ఇంకా నిరుపేదల జీవితాలు బాగుపడలేదన్నారు.

01/27/2018 - 03:28

హైదరాబాద్, జనవరి 26: శ్రీరామ్‌సాగర్, నాగార్జునసాగర్, నిజాం సాగర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. జలసౌధలో శుక్రవారం వివిధ ప్రాజెక్టుల కింద రబీ సీజన్‌కు సాగునీటి సరఫరా క్రమబద్ధీకరణపై అధికారులతో మంత్రి చర్చించారు.

01/27/2018 - 02:56

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

01/27/2018 - 02:51

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర వేడుకలు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనూ సిబ్బంది గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు. డిజిపి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని గ్రేహౌండ్స్ ఎస్‌పి ఎం.రమేష్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిజిపి కార్యాలయంలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాల బాలికలకు ఈ సందర్భంగా రమేష్ మిఠాయిలు తినిపించారు.

01/27/2018 - 02:47

చిత్రం..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

01/27/2018 - 02:45

హైదరాబాద్, జనవరి 26: పౌరులు అంతా బాధ్యతలు, విధులు చిత్తశుద్ధితో సక్రమంగా నిర్వహిస్తే భారతదేశం వేగంగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని గణతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ యూనివర్శిటీల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రధాన అతిథులు పేర్కొన్నారు.

01/27/2018 - 02:39

హైదరాబాద్, జనవరి 26: దేశాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కు తీసుకువెళ్లిందని, స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిందని బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.బిజెపి కార్యాలయంలో 69వ భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

01/27/2018 - 02:38

హైదరాబాద్, జనవరి 26: ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర భారత దేశంలో ప్రతి ఒక్కరూ జాతి అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ ఆర్టీసి మేనేజింగ్ డైరక్టర్ జివి రమణారావు అన్నారు. ఆనాటి మహనీయుల స్ఫూర్తితో సంస్థ అభ్యున్నతి కోసం అంతా సమన్వయంతో పని చేయాలని అన్నారు.

01/27/2018 - 02:32

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాల సంక్షేమం ప్రవేశపెట్టిన వివాహ సహాయ స్కీంల వల్ల బాలికల్లో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. కేంద్రప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16-17కు సంబంధించి సర్వేనిర్వహించింది. 15 నుంచి 17 సంవత్సరాలలోపు బాలికలు పాఠశాలలకు వెళ్లడంలో వృద్ధిరేటు 76 శాతం నమోదైంది.

01/26/2018 - 03:57

హైదరాబాద్, జనవరి 25: కేంద్రప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజల దగ్గరకి తీసుకువెళ్లాలని, రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్ర సహాయంతో నడుస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేటపుడు కేంద్రం చేస్తున్న సహాయాన్ని కూడా వివరించాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు.

Pages