S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/26/2018 - 03:41

ఆలేరు, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యున్నతమైన పారిశ్రామిక విధానాన్ని(టీఎస్ ఐ పాస్) రూపొందించి 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.

01/26/2018 - 03:39

వరంగల్, జనవరి 25: కేంద్రప్రభుత్వం రూపొందించిన రైట్ టు ఎడ్యుకేషన్ నిబంధనలను అమలుచేసే ఆలోచన రాష్ట్రప్రభుత్వానికి లేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నిబంధనల అమలువల్ల ఇంజనీరింగ్ కళాశాలల మాదిరిగా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చి మరో ఫీజు రీయంబర్స్‌మెంట్ స్కాంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

01/26/2018 - 03:39

వరంగల్, జనవరి 25: ఎడ్లబండ్లపై ప్రయాణం.. దారిపొడుగునా ఎవేవో అవాంతరాలు.. కనీసం వా రం రోజులు అష్టకష్టాలతో ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకోవటం.. ఇది ఇరవై ఏళ్ల కిందటి మాట. ఆ తరువాత ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావటంతో మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికలు కష్టాలు క్రమంగా తగ్గుతు వస్తున్నా యి. గిరిజన సాంప్రదాయ జాతర మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లాలంటే భక్తులకు అప్పట్లో ఎడ్లబండ్లే దిక్కు.

01/26/2018 - 03:37

మంగపేట, జనవరి 25: మేడారం జాతరలో విధులు నిర్వహించే ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేసి భక్తులు మెప్పు పొందాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.

01/26/2018 - 03:21

హైదరాబాద్, జనవరి 25: శాసనసభలో మార్చి 12న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచనప్రాయంగా వెల్లడించారు. అప్పటి వరకు కేంద్ర బడ్జెట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాబోయే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ మార్క్, టిఆర్‌ఎస్ ప్రభుత్వ మార్క్ ఉంటుందని అన్నారు. బడ్జెట్ రూపకల్పనపై సచివాలయంలో గురువారం ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి ఈటల కసరత్తు ప్రారంభించారు.

01/26/2018 - 03:17

హైదరాబాద్/వనస్థలిపురం, జనవరి 25: దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అడుగు జాడల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనను సాగిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.

01/26/2018 - 03:14

హైదరాబాద్, జనవరి 25: బిసి హాస్టళ్లలో సిసి కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, అలాగే విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ మంత్రి జోగురామన్న ఆదేశించారు.

01/26/2018 - 03:10

సికిందరాబాద్, జనవరి 25: వైద్యరంగాన్ని తమ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకెళ్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం సికిందరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు.

01/25/2018 - 01:34

హైదరాబాద్, జనవరి 24: గణతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా వేడుకలు జరిగే పరేడ్ గ్రౌండ్స్‌లోకి చేతి బ్యాగ్గులు, బ్రీఫ్ కేస్‌లు, కెమెరాలు, టిఫిన్ క్యారియర్లు వంటి వాటిని తీసుకురావడాన్ని నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి నడుచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

01/25/2018 - 01:34

హైదరాబాద్, జనవరి 24: లంచం తీసుకుంటూ రెడ్‌హేండెడ్‌గా దొరికిన తెలంగాణ ఎస్‌ఎస్‌సి (టెన్త్)బోర్డు సీనియర్ అసిస్టెంట్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ కేసుకు సంబంధించి ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages