S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/22/2018 - 03:52

హైదరాబాద్, జనవరి 21: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి అవసరమైన వారికి ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ వెల్లడించింది. ఇందుకోసం దరఖాస్తు చేసేందుకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు, వారి కుటుంబాల నుండి దరఖాస్తులు వచ్చేందుకు జాప్యం జరిగే అవకాశం ఉండటం వల్ల ఈ గడువును పొడిగించాలని జర్నలిస్టుల సంఘాలు, జర్నలిస్టులు కోరుతున్నారు.

01/22/2018 - 03:51

హైదరాబాద్, జనవరి 21: ‘రాజ్‌భవన్‌లో కాదు, ప్రజా భవన్‌లోనే ఉంటా..’ అని బిజెపి జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ లోక్‌సభకే పోటీ చేస్తానని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. గవర్నర్‌గా ఎప్పుడు వెళతారని ప్రశ్నించగా, గవర్నర్‌గా వెళ్ళే ఆలోచన ఏదీ లేదని, రాజ్ భవన్ కంటే ప్రజాభవన్‌లో ఉండాలనే కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

01/22/2018 - 03:49

నాగర్‌కర్నూల్, జనవరి 21: బీజేపీలో పనిచేసే వారికి సరైన ప్రాధాన్య ఇవ్వడంలేదని, రాష్ట్ర నాయకత్వం అధికార పార్టీ తీరుపై మెతక వైఖరి అవలంబిస్తోందని, కిందిస్థాయి కార్యకర్తలు బీజేపీ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని చెబుతూ పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

01/22/2018 - 03:27

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్రంలోని గ్రంథాలయాలకు మహర్దశ పట్టనున్నది. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలతో పాటు కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో ఆధునిక గ్రంథాలయాలను ఏర్పాటు చేసి అన్ని రకాల పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీ్ధర్ ఆదివారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

01/22/2018 - 03:25

హైదరాబాద్, జనవరి 21: రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తే దానివల్ల సత్ఫలితాలు వస్తాయని రాష్టవ్య్రవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

01/22/2018 - 03:23

వికారాబాద్, జనవరి 21: సీఎం కేసీఆర్‌ను కాళేశ్వర చంద్రశేఖర్ రావుగా ప్రశసించడం సరికాదని, కాలకూట విషపు చంద్రశేఖర్ రావు కుటుంబమని సంబోధిస్తే సరిపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.

01/22/2018 - 03:23

హైదరాబాద్, జనవరి 21: వచ్చే ఏడాదికి సంబంధించి బడ్జెట్ రూపకల్పన చకాచకా సాగుతోంది. మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో సాగునీటికి భారీ ఎత్తున రూ.28వేల కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉంది.

01/22/2018 - 03:22

హైదరాబాద్, జనవరి 21: రాజ్యాంగ పరిరక్షకునిగా ఉండాల్సిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తన స్థాయిని మరచి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును, రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తారని టి.కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

01/22/2018 - 03:21

హైదరాబాద్, జనవరి 21: వైద్య ఆరోగ్య శాఖకు 2018-19 సంవత్సరంలో ఎక్కువ నిధులు సంపాదించేందుకు ఈ శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు చేరువ అయిందని, పేద ప్రజల అవసరాలను తీరుస్తోందని, అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అందువల్ల ఈ శాఖకు ఎక్కువ నిధులు కావాలని లక్ష్మారెడ్డి కోరుతున్నారు.

01/22/2018 - 03:21

గంగాధర, జనవరి 21: ప్రాజెక్టుల సందర్శనలో ప్రభుత్వ అభివృద్ధిని మెచ్చుకోవాలే కానీ, ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిని విస్మరించి వ్యక్తులను పొగడడం రాజ్‌భవన్ నైతిక విలువలను దిగజార్చడంతో పాటు గవర్నర్ పదవిని ఒక పార్టీకి తాకట్టుపెట్టడం ఎంతవరకు సమంజసమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.

Pages