S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/31/2017 - 01:01

హైదరాబాద్, డిసెంబర్ 30: హైదరాబాద్ శివార్లలో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ గొల్ల కుర్మ భవనానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కర్నాటక మంత్రి రేవణ్ణ కెసిఆర్‌ను ప్రశంసించడంపై టి కాంగ్రెస్ ఆగ్రహంతో కుతకుతలాడుతోంది. ఈ వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా సీరియస్‌గా తీసుకున్నారు.

12/31/2017 - 00:59

హైదరాబాద్, డిసెంబర్ 30: పేద ప్రజలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ సిద్ధంగా ఉన్నప్పటికీ, బ్యాంకర్లు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు.

12/30/2017 - 04:05

సంగారెడ్డి, డిసెంబర్ 29: మహిళా సంఘాలకు స్ర్తి నిధి రుణాల మంజూరు చేయడంతో పాటు సకాలంలో తిరిగి వసూలు చేసినందుకు రాష్ట్రంలో మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, సంగారెడ్డి జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

12/30/2017 - 04:03

మహబూబ్‌నగర్, డిసెంబర్ 29: కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని కొడంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన ములాకత్ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నుండి మిడ్జి ల్ వరకు భారీ ర్యాలీని నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

12/30/2017 - 04:01

కరీంనగర్, డిసెంబర్ 29: కొత్త సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల సేవలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందిస్తూ, ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసుల సేవలు ఉంటాయని వెల్లడించారు. నాణ్యమైన సేవలందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువులుగా నిలుస్తామని చెప్పారు.

12/30/2017 - 04:00

తాడూరు, డిసెంబర్ 29: 2014 మార్చిలో నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలలో రెండు ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మీ ఎన్నిక చెల్లదని స్థానిక సీనియర్ సివిల్ కోర్టు జడ్జీ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

12/30/2017 - 03:59

మహబూబాబాద్,డిసెంబర్ 29: మహబూబాబాద్ జిల్లాలో సీపీ బాట దళసభ్యుడిని అరెస్ట్ చేసి ఆయన నుండి ఒక ఆయుధంతో సహా 25రౌండ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్‌పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

12/30/2017 - 03:58

సిద్దిపేట, డిసెంబర్ 29 : ఉమ్మడి రాష్ట్రంలో గీత కార్మికులు తీవ్ర వివక్షకు గురైనారని, కల్లు డిపోలను రద్దు చేయటంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూత పడిన కల్లు డిపోలను తెరిపించి గీతకార్మికులను ఆదుకుందన్నారు. తాటి, ఈత చెట్ల పన్నులను ఈ క్షణం నుండి రద్దు చేస్తున్నట్లు మంత్రి పద్మారావు ప్రకటించారు.

12/30/2017 - 03:55

చిట్యాల, డిసెంబర్ 29: తెలంగాణరాష్ట్రం ఏర్పడితే సాగునీరంది వ్యవసాయం సస్యశ్యామలమవుతుందనుకున్న రైతులు అందుకు విరుద్ధంగా ఉండటంతో తెలంగాణరాష్ట్రం ఆవిర్భావమయ్యాక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో శుక్రవారం జరిగిన టీ-మాస్ మండల ఆవిర్భావ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/30/2017 - 03:22

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ భూ రికార్డుల నవీకరణ పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు రెవిన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మొహమద్ మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 10806 గ్రామాల్లోని 2 కోట్ల 30 లక్షల 44వేల 373 ఎకరాలకు ఇప్పటికే 10443 గ్రామాల్లోని 2 కోట్ల 13 లక్షల 18వేల 724 ఎకరాల రికార్డులను నవీకరించామని అన్నారు.

Pages