S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/15/2017 - 23:15

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో రైతాంగానికి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేసినట్టు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభలో బుధవారం నాడు డికె అరుణ, తాటిపర్తి జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, వడ్డీ సహా లక్ష రూపాయిలు లోపు అన్ని రుణాలను మాఫీ చేశామని అన్నారు. లక్ష దాటి వడ్డీ ఉంటే దానిని వారు చెల్లించుకోవాలని అన్నారు.

11/15/2017 - 23:15

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మహిళా శిశు సంక్షేమమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం నాడు శాసనసభలో ఎన్ వి వి ఎస్ ప్రభాకర్, జి కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, రాష్ట్రంలో ఐదు లక్షల మంది దివ్యాంగులకు నెలకు 1500 రూపాయిలు చొప్పున పింఛను చెల్లిస్తున్నామని అన్నారు.

11/15/2017 - 23:03

హైదరాబాద్, నవంబర్ 5: నిత్యం ట్రాఫిక్ నరకాన్ని అనుభవించే మహానగరవాసులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు పనులు జోరుగా సాగుతున్నాయి. మొదటి నుంచి పనులు రౌండ్ ది క్లాక్ జరుగుతున్నా, ఈ నెల 28న ప్రధాన చేతుల మీదుగా ప్రారంభించాలనుకున్న మియాపూర్-అమీర్‌పేట, నాగోల్-అమీర్‌పేట కారిడార్లలో పనులు రౌండ్ ది క్లాక్ జరుగుతున్నాయి.

11/15/2017 - 23:02

నిజామాబాద్, నవంబర్ 15: నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండిపడడంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ గ్రామం జలమయంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీలను సాగర్ జలాలు పెద్దఎత్తున ముంచెత్తాయి. ఈ పరిణామంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురికావాల్సి వచ్చింది.

11/15/2017 - 23:02

మంచిర్యాల అర్బన్, నవంబర్ 15: జిల్లా కేంద్రం లో అత్త, మామ, ఆడబిడ్డ వేధింపులు భరించలేక కన్నకూతుర్ని చంపి.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకుం ది. ఎస్‌ఐ గడికొప్పుల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కాలేజీరోడ్డులోని మిమ్స్ హైస్కూల్ ఎదురుగా ఉంటున్న కేతిరెడ్డి విజ్ఞలత రెడ్డి (26) తన నాలుగేళ్ల కుమార్తె కృషిక రెడ్డిని ముం దుగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసింది.

11/15/2017 - 22:58

భద్రాచలం టౌన్, నవంబర్ 15: భద్రాద్రి రామయ్య సన్నిధిలో కార్తీకమాసం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పుణ్య నదీ హారతి కార్యక్రమం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది. గోదారమ్మ తల్లీ మమ్ము కరుణించు అంటూ నదీమ తల్లికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించగా శ్రీరామ పాదుకలకు పవిత్ర గోదావరి జలాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

11/15/2017 - 22:58

నల్లగొండ, నవంబర్ 15: బాలల దినోత్సవం సందర్భంగా నల్లగొండ అంధుల పాఠశాల( డ్వాబ్) విద్యార్థులు, నిర్వాహకులు గురువారం భారత రాష్టప్రతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్టప్రతికి వారు పుష్పగుచ్చం, పెన్నును బహూకరించారు. అందుకు ప్రతిగా రాష్టప్రతి వారి యోగక్షేమాలను అడిగి స్వీట్లు అందించారు.

11/15/2017 - 22:58

మహబూబ్‌నగర్, నవంబర్ 15: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సంబంధించిన కుడి, ఎడమ కాల్వలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాల్వల వెంట కిలోమీటర్ల మేర తిరుగుతూ హల్‌చల్ సృష్టించి అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు.

11/15/2017 - 22:57

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక జలాశయాల్లో పర్యాటక పడవల్లో విహరించే పర్యాటకులు, పడవ డ్రైవర్, సిబ్బంది విధిగా సెక్యూరిటీ జాకెట్లు ధరించాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆదేశించారు. సెక్యూరిటీ జాకెట్లు ధరించే విధంగా విస్తత్ర ప్రచారం కల్పించాలని అన్నారు. బుధవారం నాడిక్కడ నిర్వహించిన పర్యాటకుల భద్రత ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

11/15/2017 - 22:56

మెదక్, నవంబర్ 15: మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఏఐసీసీ కార్యదర్శి వీ. హన్మంతరావు ఆరోపించారు. బుధవారం మెదక్ రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపై ధ్వజమెత్తారు. కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టకుండా తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ లోపాలను ప్రజలను వివరిస్తానని స్పష్టం చేశారు.

Pages