S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/06/2016 - 12:20

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే రైతులకు అండగా ఉంటానని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తగినంత నష్టపరిహారం చెల్లించాలని కొల్లాపూర్ తహశీల్దార్ ఆఫీసు వద్ద దీక్షలు చేస్తున్న నిర్వాసిత రైతులను ఆయన సోమవారం ఉదయం కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. రైతుల తరఫున తుది వరకూ పోరాడతానని ఆయన ప్రకటించారు.

06/06/2016 - 12:19

హైదరాబాద్: అపార్ట్‌మెంటుపై నుంచి కిందకు దూకి ఓ నడివయస్కుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ ఆదర్శనగర్‌లో సోమవారం ఉదయం జరిగింది. మృతుడిని చెంగిచర్లకు చెందిన వాసి ప్రభాకరరెడ్డి (45)గా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.

06/06/2016 - 12:18

హైదరాబాద్: ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా 1,100 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేస్తారు. వెయ్యి ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులతో పాటు వంద ఏసీ బస్సులను తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుంచి కృష్ణానదీ తీరంలోని పుష్కర ఘాట్లకు నడుపుతారు.

06/06/2016 - 12:17

హైదరబాద్: నగర శివారులోని నార్సింగి వద్ద సోమవారం ఉదయం వేగంగా వస్తున్న కారు బోల్తాపడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

06/06/2016 - 08:27

హైదరాబాద్, జూన్ 5:కృష్ణా బోర్డు వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్లనుంది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, టిఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుల బృందం సోమవారం సాయంత్రం నాలుగున్నరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశం అవుతుంది.

06/06/2016 - 08:09

హైదరాబాద్, జూన్ 5: అమర వీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు ఇచ్చారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆదిలాబాద్‌లో 27 మంది అమరవీరుల కుటుంబాలు ఆ నియామక పత్రాలతో అధికారుల వద్దకు వెళితే ఉద్యోగం లేదంటూ బయటకు పంపించారని ఆయన తెలిపారు.

06/06/2016 - 08:08

సంగారెడ్డి, జూన్ 5: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన అనుమతుల మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని, అవగాహన లేని రేవంత్‌రెడ్డి ఓ బచ్చాలా కారు కూతలు కూస్తున్నాడని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేసారు.

06/06/2016 - 08:08

సంగారెడ్డి, జూన్ 5: ప్రభుత్వం అందించే నిధుల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఆర్థిక వనరులను కల్పించే కొత్త పారిశ్రామిక విధానం ద్వారా జైళ్లను అభివృద్ధి చేసి భవిష్యత్తులో ప్రభుత్వానికే నిధులు సమకూర్చే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జైళ్ల శాఖ డిజి వికె.సింగ్ పేర్కొన్నారు.

06/06/2016 - 08:07

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు అందనున్నాయి. రాష్ట్రంలోని 45వేల చెరువులను దశలవారీ పునరుద్ధరించాలని ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రారంభించింది. గత రెండేళ్ల నుంచి మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడిక తీసి చెరువును పునరుద్ధరిస్తున్నారు. అయితే రెండేళ్ల నుంచీ వర్షాలు లేకపోవడంతో చెరువుల పూడిక తీసివేత పనులు చురుగ్గా సాగినా నీరు చేరలేదు.

06/06/2016 - 08:06

తొగుట, జూన్ 5: నదులమీద నిర్మించాల్సిన రిజర్వాయర్లను బహుళ పంటలు పండే పచ్చటి భూముల్లో నిర్మిస్తూ గ్రామాలను ముంపునకు గురిచేయడం సరికాదని తెరవే (తెలంగాణ రచయతల వేదిక) అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డకిష్టాపూర్‌లో గ్రామస్థుల దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.

Pages