S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/13/2017 - 05:35

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆదివారం పదవీ విరమణ చేసిన అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనురాగ్ శర్మ 11 పోలీస్ బృందాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వీడ్కోలు పరేడ్‌లో కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపిఎస్, డిఐజీ, ఐజీ, సీఐడీ అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనురాగ్ శర్మ సభలో ప్రసంగించారు.

11/13/2017 - 05:33

హైదరాబాద్, నవంబర్ 12: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని మరింత మెరుగుపరచేందుకు నేరాలు జరగకుండా చూడాలని, నేరస్థులపై ఉక్కుపాదం మోపాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కొత్త డిజిపి మహేందర్‌రెడ్డికి సూచించారు. నరసింహన్‌ను మహేందర్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డితో గవర్నర్ కొద్దిసేపు ‘వన్ టు వన్’ చర్చించారు.

11/13/2017 - 05:31

హైదరాబాద్, నవంబర్ 12: స్వైన్‌ఫ్లూ నివారణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, వేగంగా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ చేయడం, దవాఖానాల్లో స్వైన్‌ఫ్లూ కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సరైన చికిత్స అందించడం తదితర కారణాల వల్ల స్వైన్‌ఫ్లూ వల్ల జరుగుతున్న మరణాల సంఖ్య బాగా తగ్గింది.

11/13/2017 - 05:31

హైదరాబాద్, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నెలన్నరపాటు అత్యంత కీలకంగా మారింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు, మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభం, వచ్చే నెలలో ప్రపంచ తెలుగు మహాసభలు, డిసెంబర్ నెలాఖరుకు మిషన్ భగీరథ, భూ ప్రక్షాళన కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాకరమైన ఈ కార్యక్రమాలలో ప్రభుత్వం తలమునకలైంది.

11/13/2017 - 05:25

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించడంలో బ్యాంకులు సహకరించడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతోపాటు రాష్ట్ర మంత్రులు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. దాంతో భవిష్యత్తులో బ్యాంకుల ప్రమేయం ఏమీ లేకుండా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

11/13/2017 - 05:25

హైదరాబాద్, నవంబర్ 12: ఫీజుల బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తం గా కలెక్టరేట్లను ముట్టడించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణ య్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. బిసి విద్యార్థి సంఘం అధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

11/13/2017 - 05:24

హైదరాబాద్, నవంబర్ 12: కేరళ తరహాలో పంచాయతీరాజ్ చట్టం చేయాలని సిపిఐ తెలంగా ణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు.

11/13/2017 - 05:24

నల్లగొండ, నవంబర్ 12: నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతాంగానికి యాసంగి పంటల సాగుకు కృష్ణా సాగునీటి జలాలను ఎనిమిది విడతలుగా వారబందీ (ఆన్ ఆఫ్) పద్ధతిలో అందించేందుకు ఇరిగేషన్ శాఖ సన్నాహా లు చేస్తోంది. ఇప్పటికే సరైన వర్షాలు లేక, ఎగువ ప్రాం తం నుండి కూడా సకాలంలో వరదలు రాక సాగర్ ప్రాజెక్టుకు ఖరీఫ్‌లో నీటి కొరత ఏర్పడి ఆయకట్టు రైతాంగం ఖరీఫ్ పంటల సాగుకు నోచుకోలేదు.

11/13/2017 - 05:22

హైదరాబాద్, నవంబర్ 12: రాష్టస్థ్రాయి బాలల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ అధీనంలోని ఇంటిగ్రెటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం (ఐసిపిఎస్) విభాగం నేతృత్వంలో బాలల దినోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

11/13/2017 - 05:21

హైదరాబాద్, నవంబర్ 12: పత్తి రైతులను ఆదుకోవాలని బిజెపి నాయకులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి తదితర నాయకులు ఆదివారం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

Pages