S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/12/2017 - 00:31

హైదరాబాద్, నవంబర్ 11: కార్పొరేట్ కాలేజీలను నియంత్రించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం క్యాంపస్ వ్యవహారాలపై దృష్టిసారించింది. రెగ్యులర్ కాలేజీలు, డే స్కాలర్ కాలేజీలు, సెమి రెసిడెన్షియల్ కాలేజీలు, రెసిడెన్షియల్ కాలేజీలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది.

11/11/2017 - 04:28

మహబూబాబాద్, నవంబర్ 10: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు, గంగారం, పాకాల అడవు ల్లో పోలీసులకు న్యూ డెమోక్రసీ దళ సభ్యులు పట్టుబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పార్టీకి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (ఎన్‌డీ)దళ సభ్యులు కనిపించారు.

11/11/2017 - 04:24

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని, నిజాంను కీర్తించే పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఇద్దరూ వేర్వేరుగా పాత్రికేయులతో మాట్లడుతూ ఎంఐఎం చెప్పిందే టిఆర్‌ఎస్ చేస్తోందని, కెసిఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.

11/11/2017 - 04:24

నిజాంసాగర్, నవంబర్ 10: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోకి భారీ సంఖ్యలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ రిజర్వాయర్‌కు ఉన్న 6,7,9వరద గేట్ల ద్వారా శుక్రవారం మధ్యాహ్నం 12.15నిముషాలకు నీటిని విడుదల చేశారు. బోధన్ నీటిపారుదల శాఖ ఇఇ మధుకర్‌రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి 14,350క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేశారు.

11/11/2017 - 04:23

నల్లగొండ, నవంబర్ 10: సిఎల్పీ ఉపనేత, నల్లగొం డ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోజూ తన పిచ్చిమాటలు, అబద్ధాలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడంలో గోబెల్స్‌ను మించిపోయాడని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.

11/11/2017 - 03:26

హైదరాబాద్, నవంబర్ 10: ‘ముస్లింలకు తోఫాలు’ ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును రిజర్వేషన్లపై నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. తోఫాలతో ముస్లింలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలను ఎండగట్టాలని టి.కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

11/11/2017 - 03:25

హైదరాబాద్, నవంబర్ 10: చనాకా- కొరాటా బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేయనున్నామని సాగునీటి మంత్రి హరీష్‌రావు చెప్పారు. 2018 ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని ఆయన చెప్పారు. చనాకా -కొరాటా కింద 13,500 ఎకరాలకు, పెన్ గంగ ప్రాజెక్టు కింద 37,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించామని అన్నారు.

11/11/2017 - 03:22

హైదరాబాద్, నవంబర్ 10: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయాల్లోని అర్చకులకు జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు శాసనసభలో ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి , కల్లకుంట్ల విద్యాసాగరరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీనే అర్చకులకు జీతభత్యాలు చెల్లిస్తామని అన్నారు.

11/11/2017 - 02:21

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల ఆరోపించారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కనీసం పెట్టుబడి రాని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

11/11/2017 - 02:20

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 10: పేదవాడికి పట్టడు అన్నం పెట్టే ఆహార భద్రతా చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుకారుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రూ.105కే 9 రకాల వస్తువులను అందించామని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Pages