S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/11/2017 - 02:20

హైదరాబాద్, నవంబర్ 10: రాష్ట్రంలో వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ 11వ కామన్ రివ్యూ మిషన్ ప్రశంసించింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో పర్యటించి వైద్య సేవలను అధ్యయనం చేసిన ఈ బృందం రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి వచ్చింది.

11/11/2017 - 02:19

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు గాను ఆరు ప్రత్యేక కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహ్వాన, సౌకర్యాలు, ఆహార, రవాణా, వేదికల నిర్వహణ, భద్రత కమిటీలను నియమిస్తూ శుక్రవారం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

11/11/2017 - 02:18

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని సీజ్ చేసి రికార్డులను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో న్యాయవాది ఎంఏకె ముఖీద్ పిల్ దాఖలు చేశారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఈ నెల 7వ తేదీ రాత్రి వక్ఫ్‌బోర్డుడ కార్యాలయాన్ని సీజ్ చేశారని పేర్కొన్నారు.

11/11/2017 - 02:17

హైదరాబాద్, నవంబర్ 10: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రైతులకు దేవుడు అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో రైతు సమన్వయ సమితిల అంశంపై వేముల చర్చను ప్రారంభిస్తూ రైతుల సంక్షేమం, శ్రేయస్సు గురించి కెసిఆర్ ఒక్కరే ఆలోచన చేశారని చెప్పారు. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని ప్రారంభించడంతో రైతులే అంత అవసరం లేదని, 8 నుంచి 10 గంటలు చాలని చెబుతున్నారని ఆయన తెలిపారు.

11/11/2017 - 02:17

హైదరాబాద్, నవంబర్ 10: దేశంలో కుంభమేళా తర్వాత అతిపెద్ద జాతరగా జరిగే తెలంగాణలోని సమ్మక్క సారమ్మ జాతరకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా తెలిపారు.

11/11/2017 - 02:16

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, నవంబర్ 10: ప్రమాణాలను ఉల్లంఘించిన 194 జూనియర్ కాలేజీలకు షోకాజ్ నోటీసు జారీచేసినట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో ప్రకటించారు. శాసనమండలిలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యులు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అన్న ఆంశంపై దాదాపు 45 నిమిశాల పాటు చర్చించారు.

11/11/2017 - 02:21

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రానికి మొదటి డీజీపీగా చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అనురాగ్ శర్మతో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని అన్నారు.

11/10/2017 - 23:37

హైదరాబాద్, నవంబర్ 10: వరుస కీలక సదస్సులతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఏడాదిగా ఎన్నో సదస్సులకు వేదికైన హైదరాబాద్ రానున్న రోజుల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న సదస్సులకు వేదిక కాబోతోంది. ప్రపంచంలో కీలకమైన వరల్డ్ ఐటి కాంగ్రెస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సు ఫిబ్రవరి 19 నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతుంది.

11/10/2017 - 23:34

హైదరాబాద్, నవంబర్ 10: ఇంటర్మీడియట్ విద్యను శాసిస్తన్న కార్పొరేట్ కాలేజీల ఎత్తులకు ప్రభుత్వం చిత్తవుతోంది. అధికారుల అవినీతి, ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు ఊతం ఇస్తోంది.

11/10/2017 - 23:33

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, నవంబర్ 10: కరుడు గట్టిన నేరస్తుడు నాయిం ఎన్‌కౌంటర్ జరిగి ఏడాది గడుస్తున్న ఈ కేసుకు సంబంధించి అసలు దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

Pages