S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/18/2017 - 23:03

వరంగల్, అక్టోబర్ 18: కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నపుడు జరిగిన అవకతవకలను మరచి ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో గురివింద గింజల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి కడియం విమర్శించారు.

10/18/2017 - 23:02

తాడ్వాయి, అక్టోబర్ 18: కన్నతండ్రే కాలయముడై కూతుర్ని గొడ్డలితోఅతి దారుణంగా నరికి చంపిన సంఘటన, బుధవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో జరిగింది. ఎండ్రియాల్ గ్రామానికి చెందిన గడ్డం నడిపి బాలయ్య, సాయవ్వలకు ముగ్గురు సంతానం, అందులో శ్రీజ(15) అదే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో10వతరగతి చదువుకుంటోంది.

10/18/2017 - 23:02

హైదరాబాద్, అక్టోబర్ 18: పత్తి పంటను మార్కెట్లో క్వింటా రూ.4320 మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని, వీరిలో చిన్నా, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని తెలిపారు. పంటకు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల నష్టపోతున్నారని అన్నారు.

10/18/2017 - 23:01

హైదరాబాద్, అక్టోబర్ 18: జనాభా ప్రాతిపదికగా గిరిజనుల రిజర్వేషన్లను పెంచాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్‌ను కోరింది.

10/18/2017 - 04:05

హైదరాబాద్, అక్టోబర్ 17: కల్వకుర్తి ప్రాజెక్టు పురుడు పోసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కనీసం ఎమ్మెల్యేగా కూడా లేరని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు ఎవరు తీసుకుని వచ్చారో ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడడం భావ్యం కాదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

10/18/2017 - 04:03

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీ-రీఇంబర్స్ చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (టిబిఎస్‌పి) నిర్ణయించింది. టిబిఎస్‌పి ఎగ్జిక్యూటివ్ కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమై వేర్వేరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

10/18/2017 - 04:00

హైదరాబాద్, అక్టోబర్ 17: చారిత్రక నిర్మాణమైన మక్కామసీదును ప్రభుత్వ సలహాదారు, సెక్రటరీ ఏకె ఖాన్, ఒమర్ జలీల్ మంగళవారం సందర్శించారు. మక్కామసీదు మరమ్మతు పనులను వారు పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్మాణాల మరమ్మతులకు రూ. 8.48 కోట్లు మంజూరు చేసింది. దీనిలో భాగంగానే చార్మినార్, మక్కామసీదుల మరమ్మతులు చేపట్టారు. కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన వారు పలు సూచనలు చేశారు.

10/18/2017 - 03:58

హైదరాబాద్, అక్టోబర్ 17: ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావుకు మరొక ప్రతిష్టాత్మక ఆహ్వానం లభించింది. దుబాయ్-యూఏఇకి చెందిన ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా- యూఏఇ భాగస్వామ్య సదస్సులొ పాల్గొనాల్సిందిగా మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం అందింది.

10/18/2017 - 03:57

హైదరాబాద్, అక్టోబర్ 17: బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులు మేటిగా నిలవాలని బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం నాడు సైదాబాద్‌లో నిర్మించిన బిసి స్టడీ సర్కిల్ నూతన భవనాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు.

10/18/2017 - 02:49

హైదరాబాద్, అక్టోబర్ 17: వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ పట్టణంలో గల రోహిణి ఆసుపత్రిలో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Pages