S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/17/2017 - 03:41

నిజాంసాగర్, అక్టోబర్ 16: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి వరద భారీగా రావడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం జలాశయంలోకి 18,933 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, ప్రాజెక్ట్ డిఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్ పూర్థి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, 1398.66 అడుగుల నీరు నిల్వఉందని తెలిపారు.

10/17/2017 - 03:39

గద్వాల, అక్టోబర్ 16: గత వారం రోజులుగా కృష్ణానది, జూరాల ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాలతో పాటు బీమానది వరద నీరు తోడు కావడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుండి జూరాల ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

10/17/2017 - 03:37

హైదరాబాద్, అక్టోబర్ 16: అంతర్జాతీయ విత్తన సలహా మండలి (ఇస్తా) అధ్యక్షుడిగా డాక్టర్ కె. కేశవులు ఎన్నికయ్యారు. కేశవులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ విత్తన సలహా మండలిలో ప్రముఖ సంస్థలకు చెందిన ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు.

10/17/2017 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 16: దీపావళి పండగ సెలవును 2017 అక్టోబర్ 19 న నిర్ణయిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆ రోజును సెలవుగా ప్రకటించింది. అలాగే నరక చతుర్ధశిని అక్టోబర్ 18 గా గుర్తిస్తూ, ఆరోజును ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలీడే) గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జీఓ జారీ అయింది. వాస్తవంగా 2017 సంవత్సరంలో సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం 2016 నవంబర్ 22 న ప్రకటించింది.

10/17/2017 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 16: టిడిపి, కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకుండా దగా చేసాయని, ఇప్పుడేమో తమ ప్రభుత్వం వాటిని నిర్మిస్తుంటే అడ్టుకుంటున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కూడా వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసాయన్నారు.

10/17/2017 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే, అటవీ భూముల సంరక్షణ అద్భుతంగా ఉందని పశ్చిమ బెంగాల్ కర్సియాంగ్ అటవీ అకాడమీలో శిక్షణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు అన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి 38 మంది శిక్షణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు సోమవారం దూలపల్లిలోని అటవీ అకాడమీని, అరణ్య భవన్‌ను సందర్శించారు.

10/17/2017 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 16: పి వి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల ఇస్తున్న స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేషన్ (బివిఎస్‌సి, బిటెక్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రస్తుతం నెలకు 7000 రూపాయలు స్టైపెండ్‌గా చెల్లిస్తుండగా, దీన్ని 7900 రూపాయలకు పెంచారు.

10/17/2017 - 03:31

హైదరాబాద్, అక్టోబర్ 16: దేశ భద్రత, ప్రజారక్షణలో అమరులైన పోలీసుల త్యాగం చిరస్మరణీయమని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రకృతీ వైపరీత్యాలు, విపత్తు సమయాల్లో ముందుండి సేవలందించిన అమర పోలీసుల సేవలను ఆయన శ్లాఘించారు. సోమవారం పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు.

10/17/2017 - 03:30

హైదరాబాద్, అక్టోబర్ 16: అక్రమ రవాణా, కాలం చెల్లిన బస్సులు, వాహనాల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. సోమవారం నగరశివారులో తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కిషన్‌గూడ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 10 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా నాలుగు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

10/17/2017 - 03:30

హైదరాబాద్, అక్టోబర్ 16: కొత్తగా ఏర్పడిన జిల్లాలతో కలుపుకుని మొత్తం 30 జిల్లాలకూ మత్స్య సహకార సొసైటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి తలసాని సోమవారం తన ఛాంబర్‌లో 2వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై మత్స్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Pages