S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/16/2017 - 03:52

మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 15: కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు శోకసం ద్రంలో మునిగిపోయారు. మంచిర్యాల రూరల్ సిఐ ప్రమోద్‌రావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...

10/16/2017 - 03:52

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: కోదండరామ్ వెంట నక్సలైట్లు ఉన్నారని, అందుకే తెలంగాణలో ఆయన చేపడతానని చెబుతున్న యాత్రకు అనుమతిని ఇవ్వబోమని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. కోదండరామ్‌కు అనుమతి ఇవ్వకూడదని తానే స్వయంగా పోలీసులకు చెప్పానని ఆయన స్పష్టం చేశారు.

10/16/2017 - 03:09

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందు వల్ల విద్యుత్ శాఖ అధికారులందరూ తమ కార్యస్ధలంలోనే ఉండి విధులు నిర్వహించాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలని రాష్ట్ర జెనో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు విద్యుత్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కొంత మంది విద్యుత్ అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

10/16/2017 - 03:07

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ అమర వీరుల స్పూర్తి యాత్ర నిర్వహించకుండా అడ్డుకుని, తమను అరెస్టు చేయడాన్ని రాష్ట్ర గవర్నర్‌కు, రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తామని, కోర్టుకూ వెళతామని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు.

10/16/2017 - 03:05

హైదరాబాద్, అక్టోబర్ 15: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పేలుళ్లు సంభవించవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు.

10/16/2017 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 15: గత పదిహేను రోజుల నుండి భారీ వర్షాలతో అతలాకుతలం అయి కాస్తకోలుకుంటున్న హైదరాబాద్‌కు బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న వాయుగుండం మరో గండంగా మారబోతోందని నిపుణులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపానుద్రోణి కారణంగా అల్పపీడనం ఏర్పడ్డదని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది.

10/16/2017 - 03:03

హైదరాబాద్, అక్టోబర్ 15: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఎప్పుడైనా కనీసం సర్పంచ్‌గానైనా గెలుపొందారా? అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు భయపడుతూ పర్యటనలకు ఎందుకు అడ్డుపడుతున్నారని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు.

10/16/2017 - 02:04

హైదరాబాద్, అక్టోబర్ 15: నాగార్జునసాగర్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 590 అడుగులలకు 547 అడుగులకు నీటి మట్టం చేరింది. నీటి నిల్వ 205 టిఎంసిగా నమోదైంది. శ్రీశైలంప్రాజెక్టులో 885 అడగులకు 883 అడుగుల నీటి మట్టం, 210 టిఎంసి నీటి నిల్వలు చేరాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. గత రెండు రోజులతో పోల్చితే, నీటి ప్రవాహం సగానికి సగం తగ్గింది.

10/14/2017 - 03:38

గచ్చిబౌలి, అక్టోబర్ 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందిన సంఘటన తీవ్ర సంచలన సృష్టించింది. పార్టీ చేసుకోవడానికి వెళ్లి అనంతరం సమీపంలో ఉన్న కుంటలో పడి మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తవౌతున్నాయ. పోలీసులు మాత్రం సంఘటన ప్రదేశంలో ఏం జరిగిందో తెలియాల్సి ఉందని.. పార్టీలో పాల్గొన్న వారి నుండి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. పోలీసులు విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకాం..

10/14/2017 - 03:36

నల్లగొండ, అక్టోబర్ 13: తెలంగాణ సమగ్రాభివృద్ధిలో సిఎం కెసిఆర్ దార్శనికతకు కాళేశ్వరం నుండి మూసీ ప్రాజెక్టు మీదుగా సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు గోదావరి నీరందించే కొత్త పథకం గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు.

Pages