S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/14/2017 - 03:33

మహబూబ్‌నగర్, అక్టోబర్ 13: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని రైల్వేలైన్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు, తెరాస ఫ్లోర్ లీడర్ ఎంపి జితేందర్‌రెడ్డి సారథ్యంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్‌యాదవ్‌తో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, రాంమోహన్‌రెడ్డిలు భేటీ అయ్యారు.

10/14/2017 - 03:32

సంగారెడ్డి, అక్టోబర్ 13: సింగూర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్నాటకతో పాటు సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర నదికి వరదతాకిడి పెరుగుతోంది. గత యేడాది మాదిరిగానే ఈ సారి కూడా సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వస్తున్న నీటిని దిగువన ఉన్న ఘన్‌పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వదిలిపెడుతున్నారు.

10/14/2017 - 03:29

వనపర్తి, అక్టోబర్ 13: వనపర్తి జిల్లా కేంద్రంలోని జాగృతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శివశాంతి(16) కళాశాల గదిలో శుక్రవారం తెల్లవారు జామున ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

10/14/2017 - 03:29

కెరమెరి, అక్టోబర్ 13: ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ గిరిజన మ్యూజియంలో సాంకీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, తలమడుగు గ్రామానికి చెందిన దుర్వనాగేష్‌ను పోలీసుల శుక్రవారం అరెస్టు చేశారు.

10/14/2017 - 01:53

హైదరాబాద్, అక్టోబర్ 13: కన్నుల పండువగా ప్రపంచ పర్యాటక దినోత్సవం శుక్రవారం జరిగింది. చారిత్రాత్మక తారామతి బారాదరి ప్రాంగణం వేదిక అయ్యింది. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ఉత్సవాన్ని ప్రారంభించారు.

10/14/2017 - 01:51

చిత్రం..జూబ్లీహిల్స్‌లో శుక్రవారం ప్రముఖ చిత్రకారుడు అశోక్‌కుమార్ గూడ ఏర్పాటు చేసిన
ఆర్ట్ ఎగ్జిబిషన్ కమ్ పెయింటింగ్స్‌ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కెటిఆర్

10/14/2017 - 01:48

హైదరాబాద్, అక్టోబర్ 13: ‘కెటిఆర్ సార్ రేపు మీ వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇవీ. అధికార పార్టీ నేతలకు ఫ్లెక్సీలపై నిషేదం నుంచి మినహాయింపు ఉందా’ అని ఒక నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు తీవ్రంగా స్పందించారు.

10/14/2017 - 01:47

హైదరాబాద్, అక్టోబర్ 13: పౌరసరఫరాల శాఖలో ఎలాంటి అవాంతరం వచ్చినా, అక్రమాలు జరిగినా నేరుగా వాట్సప్ ద్వారా సమాచారాన్ని ఎవరైనా పంపించేందుకు వీలుగా పౌరసరఫరాల భవన్‌లో వాట్స్‌ప్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ వాట్సప్ నెం.7330774444కు సమాచారాన్ని, ఫోటోలతో సహా పంపించవచ్చు. ఈ సెంటర్‌ను ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు.

10/14/2017 - 01:47

హైదరాబాద్, అక్టోబర్ 13: ప్రపంచ తెలుగు మహాసభల కోసం రాష్ట్రానికి తరలివస్తున్న అతిథులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఉన్నత స్ధాయి సమావేశం శుక్రవారం సమీక్షించింది. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులైన ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, తెలుగు సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం తదితరులు హాజరయ్యారు.

10/14/2017 - 01:46

హైదరాబాద్, అక్టోబర్ 13: ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికైనా ప్రతిదానికీ రాజకీయం చేయడం మానుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. పరిపాలన గాలికొదిలేసి, ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెడుతున్నారని అన్నారు.

Pages