S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/14/2017 - 01:45

హైదరాబాద్, అక్టోబర్ 13: రైతుల పాలిట శాపంగా మారిన నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిటిడిపి నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ప్రశ్నించారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా పరిహారం ఎందుకు చెల్లించడం లేదో తెలియజేయాలని అన్నారు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నేతలు ఎస్ వెంకట వీరయ్య, ఉమామాధవరెడ్డి, ఈ.పెద్దిరెడ్డి.

10/14/2017 - 01:45

హైదరాబాద్, అక్టోబర్ 13: కోటి మంది కెసిఆర్‌లు అడ్డుపడినా తాము ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. లక్ష మంది ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు వచ్చినా ప్రాజెక్టులు కట్టి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూర్యాపేట సభలో చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.

10/14/2017 - 01:43

హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నూరుద్దీన్ ఖాన్‌కు ఐసిఎంఆర్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో 11వ తేదీన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఐసిఎంఆర్ శకుంతల అమిర్ చంద్ ప్రైజ్‌ను, ఐసిఎంఆర్ చతుర్వేది కళావతి జగన్మోహన్ దాస్ స్మారక అవార్డును అందుకున్నారు.
సతీష్ చందర్‌కు తాపీ ధర్మారావు పురస్కారం

10/14/2017 - 01:42

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 48 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో సంగారెడ్డిలో 5సెం.మీ, వరంగల్ జిల్లా పర్వతగిరి, నాగర్‌కర్నూలు, భీంగల్, శాయంపేటలో 4 సెం.మీ చొప్పున, బూర్గంపాడు, సరూర్‌నగర్, సదాశివనగర్, వెంకటాపూర్‌లో 3సెం.మీ, ఏటూరునాగారం, దామరగిడ్డ, దుబ్బాకలో 2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

10/14/2017 - 01:41

హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో 2019 మార్చి 31 నాటికి ఎల్‌ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎల్‌ఈడి వీధి దీపాలను పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు.

10/13/2017 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా ఐదు సంవత్సరాల వ్యవధికి రూ. 5375 కోట్ల గ్రాంట్ వస్తుందని ప్రభుత్వం అంచన వేసింది. ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు రూ.1953 కోట్ల నిధులు విడుదల కాగా రూ.1441 కోట్లు పెట్టినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి అందిన నిధుల వ్యయం, పనులను సిఎస్ సమీక్షించారు.

10/13/2017 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 12: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ , మ్యూటేషన్‌కు అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. గురువారం నాడిక్కడ వక్ఫ్ బోర్డు కార్యకలాపాలను ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సలహాదారు ఎకె ఖాన్, కార్యదర్శి ఒమర్ జలీల్, సిఇఓ మన్నన్ ఫరూఖీ తదితరులు పాల్గొన్నారు.

10/13/2017 - 03:37

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్ర సూక్ష్మసేద్యం ప్రాజెక్టు (టిఎస్‌ఎంఐపి) సజావుగా సాగేందుకు సాంకేతిక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ఉద్యాన శాఖ కమిషనర్ చైర్మన్‌గా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

10/13/2017 - 03:37

హైదరాబాద్, అక్టోబర్ 12 : తెలంగాణ జిల్లాల్లో తాజాసమాచారం ప్రకారం భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. 2017 మే నెలతో పోలిస్తే, సెప్టెంబర్ చివరికి భూగర్భజలాలు బాగా పెరిగాయని భూగర్భజలశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాల మూలంగా నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైందని, 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

10/13/2017 - 03:36

హైదరాబాద్, అక్టోబర్ 12: సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి యధేచ్ఛగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏరులై పారుతున్న మద్యం నియంత్రించాలని నేటి ముఖ్యమంత్రి ఆనాడు శాసనసభలో డిమాండ్లు చేశారని, తీరా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బెల్టుషాప్‌నూ మూసివేయలేదని అన్నారు.

Pages