S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/20/2017 - 04:14

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వానికి సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో, జింఖానా మైదానం అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ మైదానాలను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించడాన్ని సవాలు చేస్తూ పూర్వ డిజిపి ఎంవి భాస్కరరావు తదితరులు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

09/20/2017 - 04:05

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఈ నెల 26న జరిగే మహా బతుకమ్మ నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. మహా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాల నుంచి దాదాపు 40 వేల మహిళలు వస్తారని అంచన వేస్తున్నట్టు సిఎస్ అన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు.

09/20/2017 - 03:55

హైదరాబాద్, సెప్టెంబర్ 19: డబుల్ బెడ్‌రూబ్ ఇళ్లపై జిఎస్‌టి ప్రభావం అంతగా ఉండదని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

09/20/2017 - 03:51

హైదరాబాద్, సెప్టెంబర్ 19: బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ అధికారులు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కతీ, సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వేర్వేరు రంగులు, రకరాల పూలను మహిళలు సేకరించి అందంగా తీర్చిదిద్దుతారన్నారు.

09/20/2017 - 03:51

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఉస్మానియా యూనివర్శిటీని ప్రపంచస్థాయి వర్శిటీగా తీర్చిదిద్దుతామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ యూనివర్శిటీ అభివృద్ధికి 20 ఏళ్ల ప్రణాళిక రూపొందించుకుంటున్నామని, తొలి పదేళ్లలో ప్రపంచస్థాయి యూనివర్శిటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అఖిలభారత లక్షణాలు, అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవల్సి ఉందని చెప్పారు.

09/20/2017 - 03:49

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు, సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు, పంటల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం పాలీహౌస్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలీహౌస్’ లకోసం 50 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి తాజాగా విడుదల చేసింది.

09/20/2017 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 19: అంతర్రాష్ట గంజాయి స్మగ్లర్లను ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి ముంబయికి చేర వేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15,000ల నగదుతోపాటు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు.

09/20/2017 - 02:22

హైదరాబాద్, సెప్టెంబర్ 19: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల ఆరు బంగారు గొలుసులు, హుందాయ్ సాంత్రో కారు, కారం పొడి ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక నుంచి వచ్చి హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నివాసముంటున్న నటకార్ నర్సయ్య, అనంతపురం నుంచి వచ్చి యూసుఫ్‌గూడలో నివాసముంటున్న పి సత్యనారాయణ చారిలను పోలీసులు అరెస్టు చేశారు.

09/20/2017 - 02:21

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హోం గార్డుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన హోం గార్డు జంగం శివకుమార్ చాలీచాలని వేతనంతో, సిఎం ఇచ్చిన హామీ నెరవేరక ఇక తమ బతుకులు బాగపడవన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు.

09/20/2017 - 02:20

హైదరాబాద్, సెప్టెంబర్ 19: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కాన్ఫరెన్స్ హాలులో జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, టిఎస్పీడీసిఎల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సమన్వయ సమావేశం నిర్వహించారు.

Pages