S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/20/2017 - 02:18

హైదరాబాద్, సెప్టెంబర్ 19: బతుకమ్మ చీరల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నందున రాష్ట్రప్రభుత్వం ఈ అంశంపై న్యాయవిచారణకు ఆదేశించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

09/20/2017 - 02:17

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను ఎంపి కవిత కట్టుకుంటారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు నిరసన తెలపడం తప్పా? అని ఆమె మంగళవారం మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

09/19/2017 - 04:02

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాజకీయ పరంగా టిఆర్‌ఎస్ తప్పుడు విధానాలు, దుందుడుకుకు, అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేసి అత్యధిక స్థానాలను సంపాదించే ప్రయత్నం బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. రాబోయే 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన తయారీ ప్రక్రియను ఏడాదిన్నర ముందే బిజెపి కేంద్ర నాయకత్వం ప్రారంభించిందని ఆయన చెప్పారు.

09/19/2017 - 04:00

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రతికూల వాతావరణ పరిస్థితిలోనూ పంటలు పండించే సాంకేతిక విజ్ఞానాన్ని రైతులు చేపట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేర్కొన్నారు. వాతావరణం సరిగ్గా లేకపోయినా రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు చేపట్టిన వినూత్న ప్రాజెక్టుపై సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/19/2017 - 03:58

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 18: వేర్వేరు సంఘటనల్లో మరణానికి చేరువైన ఇద్దరు అవయవదానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టారు. ఓల్డ్ మలక్‌పేట, ప్రేమలతనగర్‌కు చెందిన శ్రీనివాసరావు (45) టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 15న మధ్యాహ్నం షాప్ నుంచి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన శ్రీనివాసరావుకు భోజనం అనంతరం బిపి పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

09/19/2017 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నామని, సర్వీసు రూల్స్ సైతం త్వరలో ఖరారు చేసి టీచర్లకు పదోన్నతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. లాంగ్వేజి పండిట్లు, పిఇటిలకు కూడా స్కూల్ అసిస్టెంట్లుగా చేసి సర్వీసు రూల్స్ కిందకు తెస్తామని అన్నారు.

09/19/2017 - 03:51

హైదరాబాద్, సెప్టెంబర్ 18: భారత ఉప-రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు తెలంగాణలో రెండు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు వెంకయ్యకు వీడ్కోలు పలికారు. వీడ్కోలు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె.

09/19/2017 - 03:49

గద్వాల, సెప్టెంబర్ 18: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాలకు జలకళ సంతరించుకుంది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి 1,68,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 20 గేట్లను తెరిచి దిగువ భాగానికి 1,73,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

09/19/2017 - 02:24

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఈ ఏడాదిలోగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లలోగల అన్‌మాన్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఎత్తివేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆ దిశగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

09/19/2017 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 18: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు కొన్ని జిల్లాల్లో చురుకుగా సాగడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే పనులు చురుకుగా జరుగుతుండగా ఏడు జిల్లాల్లో వెనుకబడి పోయిందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రాజీవ్ స్వగృహ పథకాలపై సచివాలయంలో సోమవారం సంబంధిత శాఖ అధికారులతో సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Pages