S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/09/2017 - 03:47

మహబూబ్‌నగర్, ఆగస్టు 8: జిఎస్‌టిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన కెసిఆర్ ఇప్పుడు మాటమార్చడంలో ఆంతర్యమేమిటని పిసిసి ఉపాధ్యక్షురాలు, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ప్రశ్నించారు.

08/09/2017 - 03:47

భువనగిరి, ఆగస్టు 8: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన సమావేశంలో నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఇద్దరు నాయకులు తీవ్రగాయాలపాలయ్యాయ. ఈ సంఘటన పార్టీ వర్గాలలో సంచలనం రేపింది.

08/09/2017 - 03:46

గోదావరిఖని, ఆగస్టు 8: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 375 కోట్ల రూపాయలతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, 2 కమిషనరేట్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/09/2017 - 03:46

కడెం, ఆగస్టు 8: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ సెక్షన్ పరిధిలో గల అడవులను మంగళవారం కవ్వాల్‌టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎఫ్‌డిపిటి శర్వానంద్ పర్యటించి పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. గంగాపూర్ అడవుల్లో వన్యఫ్రాణుల దాహా ర్తి తీర్చడానికి నిర్మాణం చేపట్టిన చెక్‌డ్యాం, వన్యప్రాణులకు తాగునీరందించడానికి ఏర్పాటు చేసిన హ్యాండ్‌పంపు, సాసర్‌ఫిట్‌లను ఆయన పరిశీలించారు.

08/09/2017 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 8: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు సందర్శకుల పాస్‌లను కూడా రద్దు చేస్తున్నట్టు విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారుల ఆదేశాల మేరకు సాయుధ బలగాలను మోహరించారు.

08/09/2017 - 03:21

హైదరాబాద్, ఆగస్టు 8: బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా 90 లక్షల మందికి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి జిల్లా మండల గ్రామస్థాయిలో నోడల్ అధికారులను నియమించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు.

08/09/2017 - 03:19

హైదరాబాద్, ఆగస్టు 8: ఉప రాష్టప్రతి పదవికి వనె్నతెస్తానని ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు ఉపన్యాసాలు, రచనలు, పార్లమెంటు ప్రసంగాలతో కూడిన ‘అలుపెరగని గళం- విరామమెరుగుని పయనం ’ గ్రంథాల ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం-రాష్ట్రాలు కలిసి పనిచేయాలి, అపుడే దేశం శక్తివంతంగా మారుతుందని , ఈ దేశానికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.

08/09/2017 - 03:15

హైదరాబాద్, ఆగస్టు 8: శ్రీరామ్‌సాగర్ పునరుజ్జీవ పథకానికి ఈ నెల 10న ప్రారంభించిన అనంతరం అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి వెళ్తారు. ఈ నెల 11న ఢిల్లీలో జరిగే ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ముందు రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

08/09/2017 - 03:14

హైదరాబాద్, ఆగస్టు 8: జంటనగరాల ప్రజలకు, నల్లగొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి కోసం 15 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబి పాటిల్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. అల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు.

08/09/2017 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 8: ‘బంగారు తెలంగాణ’ లక్ష్యం వైపు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం లేదంటూ తాను అడిగిన 12 ప్రశ్నలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమాధానం చెప్పకుండా, తాను ‘సిల్లీ’గా మాట్లాడినట్లు ఎదురు దాడి చేశారని సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సురవరం మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో 12ప్రశ్నలను మళ్లీ సంధించారు.

Pages