S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/07/2017 - 23:05

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ మెడికల్ సీట్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. మెడికల్ సీట్ల అడ్మిషన్లపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మైనార్టీ, బి కేటగిరి, సి కేటగిరి మెడికల్ సీట్ల ఫీజులను కావాలనే మార్చారని హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను విచారించింది.

08/07/2017 - 04:01

సూర్యాపేట, ఆగస్టు 6: న్యాయవ్యవస్థపై సమాజంలో నమ్మకాన్ని పెంపొందించేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు పనిచేస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ముందుకు సాగాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి డాక్టర్ బి.శివశంకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.8 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కోర్టు భవన సముదాయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు.

08/07/2017 - 03:59

ఉపరాష్టప్రతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడుకు తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కెటి రామరావు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం వెంకయ్య నాయుడు నివాసంలో ఆయనను కలిసి అభినందించారు.

08/07/2017 - 03:54

సంగారెడ్డి, ఆగస్టు 6: గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సెంటిమెంట్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలంతా ఓటమి పాలయ్యారని, రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీ విజయబావుటా ఎగురవేసేలా పార్టీని బలోపేతం చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి వెల్లడించారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

08/07/2017 - 03:53

గజ్వేల్, ఆగస్టు 6: దేశంలో బిజెపికి ఎదురులేదని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఇప్పటికే 18 రాష్ట్రాల్లో పాగా వేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున యువకులు బిజెపిలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

08/07/2017 - 03:51

హైదరాబాద్, ఆగస్టు 6: అస్వస్థతకు గురై యశో దా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఆదివారం మధ్యా హ్నం యశోదా ఆస్పత్రికి వెళ్లి మంత్రి తుమ్మలతోనూ, వైద్యులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. తుమ్మల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వా తే విధులకు హాజరుకావాలని తుమ్మలకు సిఎం సూచించారు.

08/07/2017 - 02:44

హైదరాబాద్, ఆగస్టు 6: జీఎస్టీ కారణంగా నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులపై 12 శాతం భారం పడుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించడం న్యాయ సమ్మతం, సమంజసం కాదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జిఎస్‌టిపై తప్పుడు ప్రచారం చేయరాదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రిని కోరారు.

08/07/2017 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 6: తన బతుకంతా తెలంగాణకే అంకితం చేసిన ధన్యజీవి ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు నేతలు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆదివారం ఘనంగా ప్రొఫెసర్ జయంతి నిర్వహించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమం కోసం తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

08/07/2017 - 02:19

హైదరాబాద్, ఆగస్టు 6: పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఇప్పుడు మెడికల్ కాలేజీ కోసం ఆమరణ దీక్ష అంటూ రాజకీయం చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని, మెడికల్ కాలేజీని పొన్నం ప్రభాకర్ ఎందుకు సాధించ లేకపోయారని ప్రశ్నించారు.

08/07/2017 - 02:17

హైదరాబాద్, ఆగస్టు 6: రాష్ట్రంలో ఏకపక్ష కుటుంబ పాలన కొనసాగుతున్నదని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం శని, ఆదివారాల్లో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం పార్టీ జాతీయ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులుతో కలిసి విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.

Pages