S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/12/2017 - 02:23

హైదరాబాద్, జూలై 11: కేశవ మెమోరియల్ విద్యాసంస్థల కార్యదర్శి తుమ్మలపల్లి హరి హర శర్మ బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్ కార్యవాహ భాగయ్య , దత్తాత్రేయ హోసబలే సహా పలువురు వక్తలు పేర్కొన్నారు. గత నెల 29న తుదిశ్వాస విడిచిన హరిహర శర్మ శ్రద్ధాంజలి సభను ఆయన అభిమానులు, కేశవ స్మారక సమితి, ఎబివిపి కలిపి మంగళవారం రాత్రి నిర్వహించాయి.

07/12/2017 - 02:21

హైదరాబాద్, జూలై 11: భూముల రికార్డుల్లో తప్పులను, లోపాలు ఉంటే సరి చేసే ప్రక్రియను వేవవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంబంధిత అధికారులను ఆదేశించారు. రికార్డు రెక్ట్ఫికేషన్‌ను మ్యాడుల్‌ను జాయింట్ కలెక్టర్, ఆర్టీవోలు పరిశీలించాలన్నారు. మ్యుటేషన్లను అకారణంగా తిరస్కరించారాదని ఆయన సూచించారు.

07/12/2017 - 02:20

హైదరాబాద్, జూలై 11: జాతీయ చేనేత దినోత్సవాన్ని వచ్చే నెల 7న ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోరారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ మంగళవారం వారికి లేఖ రాశారు. ఈ ఏడాది చేనేత దినోత్సవాన్ని చేనేత వస్త్రాల ప్రచారానికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

07/12/2017 - 02:19

హైదరాబాద్, జూలై 11: చట్టం కల్పించిన సౌకర్యాలను దివ్యాంగులు ఉపయోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రోడ్లుభవనాలు, మహిళా సంక్షేమం, వికలాంగుల సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మహిళా సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని మంగళవారం ఆయన ఏర్పాటు చేశారు.

07/12/2017 - 02:16

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ పోలీస్ శాఖలో పలువురు అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయి. 16 మంది అసిస్టెంట్ కమాండెంట్లను బదిలీ చేస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న టిఎస్‌ఎస్‌పి ఒకటో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం జయరాజు, మమ్నూర్ నాల్గో బెటాలియన్‌కు బదిలీ అయ్యారు.

07/12/2017 - 02:15

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి సరళీకరణ విధానాలను (ఈజ్ ఆఫ్ బిజినెస్) అమలు చేసేందుకు గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పేరుతో మంగళవారం జీఓ (జీఓ ఎంఎస్ నెంబర్ 41) జారీ అయింది.

07/12/2017 - 02:13

హైదరాబాద్, జూలై 11: ఉస్మానియా యూనివర్శిటీలో మరోమారు రణరంగం మొదలైంది. ఏళ్ల తరబడి హాస్టళ్లలో కొనసాగుతున్న అనధికార విద్యార్థులను బయటకు పంపించే కార్యక్రమం చేపట్టినట్టు వర్శిటీ అధికారులు చెబుతున్నారు. చదువు పూర్తి చేసిన విద్యార్థులను, తదుపరి విద్యాసంవత్సరానికి హాస్టల్ సీటు పొందని వారిని సైతం హాస్టళ్ల నుండి బయటకు పంపించేందుకు వర్శిటీ అధికారులు పోలీసుల సహాకారం తీసుకుంటున్నారు.

07/12/2017 - 02:13

హైదరాబాద్, జూలై 11: రైతుల రుణ మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రెండు, మూడు రోజుల్లో తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

07/12/2017 - 02:10

హైదరాబాద్, జూలై 11: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ ఫోర్ ఉద్యోగులు మంగళవారం సచివాలయంలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తమను వెంటనే తెలంగాణకు తీసుకువస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన ఇతర ఉద్యోగులు విజయవాడ నుండి వారానికి ఒక సారి వచ్చి వెళుతున్నారని, క్లాస్ ఫోర్ ఉద్యోగులైన తాము ఆ విధంగా ప్రయాణించలేకపోతున్నామని పేర్కొన్నారు.

07/11/2017 - 23:33

హైదరాబాద్, జూలై 11: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలకు ప్రతి జిల్లాకు బాలల సంరక్షణ కమిటీల ఏర్పాటుతో పాటు బాల నేరస్థుల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు వీటికి సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు.
టిఆర్‌ఎస్‌వి కమిటీలకు సిఎం ఆమోదం

Pages