S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/13/2018 - 06:00

* ఆర్టీసీ, ప్రభుత్వానిదే బాధ్యత * రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
* లేకుంటే మహాకూటమి సర్కార్ ఇస్తుంది * రవాణా మంత్రి, చైర్మన్, ఎండీలపై కేసులు పెట్టాలి
* కేసీఆర్ తీరుపై అఖిలపక్ష నేతల మండిపాటు

09/13/2018 - 05:58

హైదరాబాద్, సెప్టెంబర్ 12: మహాకూటమి ఏర్పాటుపై తొలి అడుగులు వేసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు మలి అడుగులకు సిద్ధమవుతున్నాయి. ముందు నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైతే తదుపరి చర్చలు కీలక నేతలతో నిర్వహించనున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు, టీ టీడీపీ నేతలు , సీపీఐ నేతలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడంతో మహాకూటమి ఏర్పాటులో ఎదురయ్యే ప్రతిబంధకాలు తేటతెల్లం అయ్యాయి.

09/13/2018 - 05:55

జగిత్యాల/మల్యాల, సెప్టెంబర్ 12: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్ బోల్తాపడి సంఘటనలో 57మంది దుర్మరణం చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రానే్న కుదిపేయగా బుధవారం మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 60కి చేరింది.

09/13/2018 - 05:47

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్‌కి బడ్జెట్ ప్రాధమిక స్థాయిలో 1498.83 కోట్లు, మాధ్యమిక స్థాయిలో 761.01 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్‌కు 25.38 కోట్లు కలిపి మొత్తం 2285.31 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రం 479.49 కోట్లు భరించాల్సి ఉంటుంది.

09/13/2018 - 05:50

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయకుండానే ఎన్నికలకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌కు ఉద్యోగుల వ్యతిరేకత తప్పదని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హెచ్చరించారు. ఉద్యోగుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం అదే ఉద్యోగుల వృద్ధాప్యంలో ఆదుకునే పాత పెన్షన్ విధానం అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిందని ఆయన విమర్శించారు.

09/13/2018 - 05:45

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ పురావస్తు చరిత్ర వారసత్వ సంపదకు సంబంధించి సమగ్ర పరిశోధనలు జరగాలని సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి- చరిత్ర, వారసత్వ సంపద అనే అంశంపై బుధవారం నాడు తెలుగు యూనివర్శిటీలో తెలంగాణ విద్యా, సామాజిక సాంస్కృతిక సాహిత్య వేదిక నిర్వహించిన సదస్సుకు విజయరామారావు అధ్యక్షత వహించారు.

09/13/2018 - 05:44

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వీఆర్వోల రాత పరీక్షను ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నామని, అందుకోసం భారీ ఏర్పాట్లు చేశామని టీఎస్‌పిఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. 700 పోస్టులకు 10,58,868 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారని అన్నారు. ఇంత వరకూ 7.80 లక్షల మంది తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని అన్నారు.

09/13/2018 - 05:43

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఈ నెల 23,24, 25వ తేదీలో వాడీలో జరగనున్న హజరత్ కవాజ్ సయ్యద్ ఉత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళనున్న భక్తులక కోసం హైదరాబాద్, వాడీ మధ్య ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే సిపీఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు. 23వ తేదీ (ఆదివారం) 07025 ప్రత్యేక రైలు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వాడీకి సాయంత్రం 4.55 గంటవకు చేరుకుంటుంది.

09/13/2018 - 05:42

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని టీడీపీ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ మహాకూటమిని ప్రశ్నించే హక్కు హరీష్‌రావుకు లేదని అన్నారు.

09/12/2018 - 17:29

మంచిర్యాల: చెన్నూరు సీటును కేటాయించిన ఎంపీ సుమన్ ప్రచారం చేస్తుండగా.. ఇందారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఓదెల అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్ పోసుకుని ఆత్యాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు గట్టయ్య మంటలు ఆపి ఆసుపత్రికి తరలించారు.

Pages