S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/10/2017 - 03:16

నిర్మల్, జూన్ 9: గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని, దీనిని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ మండిపడ్డారు. శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో 240 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు.

06/10/2017 - 03:14

కరీంనగర్, జూన్ 9: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి, కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మూడేళ్ళలో జరిగిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ అన్నారు.

06/10/2017 - 02:40

హైదరాబాద్, జూన్ 9: లింగ నిర్థారణ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినతరమైన చట్టాలు చేయాలని వివిధ మహిళా సంఘాల నాయకులు, సామాజికవేత్తలు డిమాండ్ చేశారు.

06/10/2017 - 02:34

హైదరాబాద్, జూన్ 9: మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐతోనే విచారణ జరిపించాలని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తున్నందున స్థానిక పోలీసులు, దర్యాప్తు సంస్థలతో కాకుండా సిబిఐతోనే విచారణ జరిపితే న్యాయం జరుగుతుందని అన్నారు. 10 నుంచి 15 వేల కోట్ల విలువైన ఈ భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోందని అన్నారు.

06/10/2017 - 02:34

హైదరాబాద్, జూన్ 9: అమెరికా పర్యాటకుడు జాన్ ఫ్రీజర్‌కు తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదుకున్నారు. శుక్రవారం సచివాలయానికి వచ్చిన జాన్ ఫ్రీజర్‌కు బుర్రా వెంకటేశం స్వాగతం పలికారు. ఫ్రీజర్ ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసుకున్న బుర్రా వెంకటేశం ఆయన్ను స్వదేశానికి వెళ్ళేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

06/10/2017 - 02:33

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య విడుదల చేశారు. గత నెల 15 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించగా 4,78,280 మంది విద్యార్థులు హాజరయ్యారు.

06/10/2017 - 02:32

హైదరాబాద్, జూన్ 9: అపోలో వైద్య సంస్థ ఏర్పాటు చేసిన అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ అండ్ రీసెర్చ్‌లో ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనుమతించింది.

06/10/2017 - 02:31

హైదరాబాద్, జూన్ 9: పేరు మినరల్, నీరు కెమికల్ పేరుతో ఆంధ్రభూమిలో ఈ ఏడాది ఏప్రి ల్ 24వ తేదీన ప్రచురితమైన వార్తపై నివేదిక ఇవ్వాలని లోకాయుక్త హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యాధి నిరోధక ఔషధ సంస్ధ, ప్రజారోగ్య శాఖ, ఆహార పరిపాలన శాఖను ఆదేశించింది. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ బి సుభాషణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

06/10/2017 - 02:30

హైదరాబాద్, జూన్ 9: నూతన ఉపాధి అవకాశాల ద్వారా బలహీనవర్గాల యువతకు సంపద సృష్టించి, అభివృద్ధి చెందేందుకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని బిసి కమిషన్ ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులను తెలంగాణ బిసి కమిషన్ ఆదేశించింది. బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యులు కృష్ణమోహన్ రావు, ఆంజనేయతగౌడ్, గౌరీశంకర్, సభ్య కార్యదర్శి జిడి అరుణ తదితరులు పాల్గొన్నారు.

06/10/2017 - 01:20

చిత్రం.. రుతుపవనాల రాకతో కురిసిన జల్లులకు శుక్రవారం హైదరాబాద్‌లో జలమయమైన మోజం జాహి మార్కెట్

Pages