S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2017 - 02:55

హైదరాబాద్, మే 2: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం సత్వరం పూర్తి చేయడమే కాకుండా డ్యామ్‌ల పటిష్ఠతకు ప్రాధాన్యత ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. డ్యామ్ గేట్లు, వాటి పనితీరు, ఇతర అంశాలపై నిరంతరం తనిఖీ, పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మంగళవారం వాలంతరి సంస్థలో జరిగిన డ్యాంల సేప్టీ సదస్సులో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

05/03/2017 - 02:53

హైదరాబాద్, మే 2: ఇప్పటికే అత్యధిక కాలం గవర్నర్‌గా పని చేసిన రికార్డు సృష్టించిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌కు మరోసారి పొడిగింపు లభించింది. యుపిఏ హయాంలో నియమితులైన గవర్నర్ అయినప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల వల్ల రెండవ సారి కూడా పొడిగింపు లభించింది.

05/03/2017 - 02:52

హైదరాబాద్, మే 2: వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు సమర్ధవంతంగా పనిచేసేలా పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడమేగాక, డిమాండ్ మేరకు కొత్త స్కూళ్లను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యాశాఖకు కావల్సిన నిధులను కేంద్రం నుండి వీలైనంత ఎక్కువగా తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.

05/03/2017 - 02:46

హైదరాబాద్, మే 2: సింగరేణి సంస్ధకు కొత్త డైరెక్టర్లుగా బి. భాస్కర రావు (ప్లానింగ్-ప్రాజెక్ట్సు), ఎస్. చంద్రశేఖర్ (ఆపరేషన్స్) నియమితులయ్యారు. ఇప్పటి వరకు బి. భాస్కర రావు జి.ఎం కార్పోరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టుగా, చంద్రశేఖర్ ఆడ్రియాల లాంగ్‌వాల్ ఏరియా జిఎంగా విధులు నిర్వహిస్తున్నారు.

05/03/2017 - 02:42

హైదరాబాద్, మే 2: తెలంగాణ ప్రాంత పర్యాటక ప్రదేశాల చిత్రాలతో అలకరించిన విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి స్పైస్ జెట్ విమాన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

05/03/2017 - 02:40

హైదరాబాద్, మే 2: తాడిచర్ల గనుల ప్రైవేటీకరణను అడ్డుకుందామని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల్లోని తాడిచర్ల బ్లాక్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఐ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కోదండరామ్ ప్రసంగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అన్నారు.

05/03/2017 - 02:38

హైదరాబాద్, మే 2: ఎత్తు తక్కువగా ఉన్నారనే కారణంపై కారుణ్య నియామకల విధానంలో ఒక మహిళకు టిఎస్‌ఆర్టీసి ఉద్యోగం ఇవ్వకపోవడం తప్పని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమకు కారుణ్య నియామకాల కింద టిఎస్‌ఆర్టీసి ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ బి అన్నపూర్ణ, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు విచారించారు.

05/03/2017 - 02:37

హైదరాబాద్, మే 2: నగర ప్రజలకే కాదు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వరకూ కంపు కొడుతున్న మూసీ నదికి మోక్షం రాబోతున్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తున్నది. మూసీలో స్వచ్ఛమైన నీరు గలగలా పారేలా చూస్తామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు ఇదివరకే పలు పర్యాయాలు ప్రకటించారు. ఈ మేరకు మొత్తం మీద అంకురార్పణ జరిగింది.

05/03/2017 - 02:36

హైదరాబాద్, మే 2: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా ఎంజి శేఖరమ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్‌కు చెందిన శేఖరమ్ భారత రైల్వే ట్రాఫిక్ సర్వీసు, చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ఫ్రైట్ సర్వీసులు)గా పనిచేశారు. సేఫ్టీ, కమర్షియల్ విభాగాల్లో విశిష్ట సేవలందించిన ఆయన 1990లో చెన్నై, మధురై, హుబ్లి, గుంతకల్లులో పనిచేశారు.

05/03/2017 - 02:35

హైదరాబాద్, మే 2: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు మరోమారు దుమారం రేపుతోంది. నరుూం కేసులో ఇప్పటికే కొందరు పోలీస్ అధికారులపై వేటు పడినప్పటికీ ఇంకా 12 మంది పోలీసులకు నరుూం నేరాలతో సంబంధాలున్నట్టు సిట్ నిర్ధారింది. తాజాగా జరిపిన దర్యాప్తులో బయటపడ్డ పోలీసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం చర్యలకు సిద్ధమవుతోంది. తొలుత ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Pages