S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/09/2016 - 16:37

హైదరాబాద్: రాబోయే 48 గంటల వ్యవధిలో తెలంగాణలోని పలు చోట్ల వానలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడతాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత మూడు, నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా చెట్లు, హోర్డింగ్‌లు కూలిపోయి రహదారులకు, విద్యుత్ వ్యవస్థకు నష్టం జరిగిన సంగతి తెలిసిందే.

05/09/2016 - 16:36

హైదరాబాద్: సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నమనేని సోమవారం ఉదయం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. చెన్నమనేని మృతదేహాన్ని సందర్శించి కెసిఆర్ నివాళులర్పించారు. ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం జరుగుతాయి.

05/09/2016 - 15:41

హైదరాబాద్: పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈనెల 12న ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు.

05/09/2016 - 15:41

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీరెడ్డి మృతికేసులో నిందితుడైన ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డిని పోలీసులు సోమవారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో నిందితుడిని పోలీసులు హాజరు పరచగా ఈనెల 23 వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. భరతసింహారెడ్డి కారు నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవీరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.

05/09/2016 - 15:40

మహబూబ్‌నగర్: రాజోలిబండ ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అయిజ మండలం సిందనూరు వద్ద ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వేలాదిమంది అనుచరులతో చేపట్టిన దీక్ష వద్దకు సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు హాజరై మద్దతు ప్రకటించారు.

05/09/2016 - 15:40

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం వద్ద సోమవారం మధ్యాహ్నం మందుపాతర పేలి ఓ కానిస్టేబుల్ మరణించాడు. ఈ ఘటనలో గాయపడిన మరో కానిస్టేబుల్‌ను ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించారు. మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న మారాయిగూడెంలో రహదారి పనులను అధికారులు చేపట్టగా అక్కడ భద్రత కోసం కొంతమంది కానిస్టేబుళ్లను నియమించారు. రోడ్డు పనులు జరుగుతుండగా మందుపాతర పేలింది.

05/09/2016 - 15:38

నల్గొండ: బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగలను పోలీసులు సోమవారం ఇక్కడ అరెస్టు చేశారు. వారి నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, లక్షన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు.

05/09/2016 - 15:37

హైదరాబాద్: రైల్వేశాఖలో ఉద్యోగాల పేరిట 7లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి మోసగించిన దంపతులపై పోలీసులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. మేడిపల్లిలో ఉంటున్న మహ్మద్ హమీద్, అర్షియా బేగం దంపతులు ఉద్యోగాలిప్పిస్తామని భారీగా డబ్బులు వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన యువకులు గట్టిగా అడిగితే ఆ దంపతులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు.

05/09/2016 - 12:43

హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు మరణం పట్ల తెలంగాణ, ఎపి సిఎంలు కెసిఆర్, చంద్రబాబు, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, వామపక్ష నేతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు నివాళులర్పించారు.

05/09/2016 - 12:43

కరీంనగర్: ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సీనియర్ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు (95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన దశాబ్దాల పాటు సిపిఐలో ఉంటూ 1994లో టిడిపిలో చేరారు. సిరిసిల్ల నుంచి 5 సార్లు, మెట్టుపల్లి నుంచి ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Pages