S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/31/2017 - 06:24

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సాంకేతికపరమైన అభిప్రాయాలను తెలియచేయాలని కేంద్ర జల సంఘం నాలుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం రాష్ట్రప్రభుత్వాలకు లేఖలను పంపింది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల్లోపల తమ అభిప్రాయాలను తెలియచేయాలని కేంద్ర జల సంఘం కోరింది.

03/31/2017 - 06:24

హైదరాబాద్, మార్చి 30: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ)కు అనుంబంధ విభాగమైన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి)తో రైల్వే అవగాహన ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని రైల్వే ప్రధాన కార్యాలయం, రైల్వే స్టేషన్లను పచ్చదనంతో, పర్యావరణాన్ని కాపాడేవిధంగా గ్రీన్‌బిల్డింగ్ అభివృద్ధికి గాను ఐజిబిసితో ఒప్పందం దోహదపడుతుందని రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు.

03/31/2017 - 06:23

హైదరాబాద్, మార్చి 30: మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రాణప్రదమైన నాలుగు ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, ప్రాజెక్టులను ఇష్టం వచ్చినట్టు మారుస్తోందని బిజెపి సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి విమర్శించారు. మహాత్మాగాంధీ -కల్వకుర్తి ఎల్‌ఐఎస్, కోయిల్‌సాగర్ ఎల్‌ఐఎస్, రాజీవ్- బీమా , జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

03/31/2017 - 06:22

హైదరాబాద్, మార్చి 30:దాదాపు 37లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ సమస్యగా మారుతోంది. జివో 123పై హైకోర్టు స్టే విధించడంతో భూ సేకరణ చట్టం 2013 ప్రకారం భూ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ఇంజనీరింగ్ అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

03/31/2017 - 06:22

హైదరాబాద్, మార్చి 30: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. హెచ్‌సిఏకు ఎన్నికలు నిర్వహించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్‌వి భట్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా దిగువ కోర్టు 2016 డిసెంబర్ 16వ తేదీన అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది.

03/31/2017 - 06:21

హైదరాబాద్, మార్చి 30: తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు తమను స్పీకర్ సస్పెండ్ చేయడం న్యాయవిరుద్ధమని, స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సస్పెండైన టిడిపి శాసనసభాపక్ష నేత ఎ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయమై శాసనసభ స్పీకర్, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు.

03/31/2017 - 01:05

హైదరాబాద్, మార్చి 29: మహానగర మంచి నీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి చేపట్టిన మురుగు నీటి పారుదల బృహత్ పథకం అమలులో ప్రణాళికా లోపం ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది.

03/31/2017 - 01:04

హైదరాబాద్, మార్చి 29: విద్యా కేంద్రీయ సలహా మండలి కేబ్ చేసిన సూచన మేరకు డిటెన్షన్ విధానాన్ని కొనసాగించడం వల్ల విద్యార్థులకు ఆ నిర్ణయం శాపంగా మారిందని ఎన్‌జిఓలు అభిప్రాయపడుతున్నాయి.

03/31/2017 - 01:04

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఈ వారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ రెండు యూనివర్శిటీల్లో ఒకటి యాదాద్రి జిల్లాలోనూ ఇంకోటి నిజామాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది.

03/31/2017 - 01:00

నిజామాబాద్, మార్చి 30: ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేసిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రధాన అనుచరుడు, పట్టణ తెరాస నాయకుడు ఆబిద్ సోఫీ ఎట్టకేలకు ఉద్యోగ సంఘాల నిరవధిక నిరసనలకు దిగిరాక తప్పలేదు.

Pages