S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/24/2017 - 03:17

హైదరాబాద్, మార్చి 23: రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలకు గేట్లెత్తుతూ దానికి చట్టబద్దత చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం దేశ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తుందని అన్నారు. 2017 ఆర్థిక బిల్లుకు చేపట్టనున్న సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

03/24/2017 - 03:16

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రం ‘వైరల్ తెలంగాణ’గా మారిందని కాంగ్రెస్ శాసనసభ్యుడు డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. శాసనసభలో వైద్య ఆరోగ్య పద్దుపై గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా డెంగీ తదితర వైరల్ జ్వరాలతో జనం బాధపడుతున్నారని తెలిపారు.

03/24/2017 - 02:40

నల్లగొండ, మార్చి 23: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీ (510 అడుగులు) కంటే దిగువకు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ ఇది చేదు వార్తే. జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగుల కాగా గురువారం నాటికి 509.70 అడుగులకు పడిపోయింది. ఇక ఆశలన్నీ శ్రీశైలం రిజర్వాయర్‌పైనే. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 812.20 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి.

03/24/2017 - 02:38

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆసరా’ పథకం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆసరాగా మారిందని చెప్పవచ్చును. 2014 నవంబర్ 8వ తేదీన కెసిఆర్ అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం నిధుల కొరత తలెత్తకుండా పక్కా ప్రణాళికతో అమలు చేస్తోంది.

03/24/2017 - 02:37

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 23: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతామని బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను కట్టబెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

03/24/2017 - 02:35

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో అటవీ భౌగోళిక ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ అటవీ విధానాన్ని పురస్కరించుకుని భవిష్యత్ అవసరాల దృష్ట్యా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

03/24/2017 - 02:34

హైదరాబాద్, మార్చి 23: రానున్న ఐపిఎల్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) వ్యవహారాల పర్యవేక్షణకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమిస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్ దావే, హైకోర్టురిటైర్డు జడ్జి జస్టిస్ జివి సీతాపతిని నియమించినట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

03/24/2017 - 02:33

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలపై అధ్యయనానికి ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ టి తిరుపతి రావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఒయు మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం ముత్తారెడ్డి, కాకతీయ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ జగన్నాధస్వామి సభ్యులుగా ఉంటారు.

03/24/2017 - 02:33

హైదరాబాద్, మార్చి 23: గర్భిణీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను వాటితో పాటు కెసిఆర్ పేరిట కిట్‌లను అందిస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం నాడు శాసనసభలో వివిధ పద్దుల కింద జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ, రాష్ట్రంలో ఆస్పత్రుల ముఖచిత్రాన్ని మార్చేశామని, ఔషధాలకు 300 కోట్లు కేటాయించామని అన్నారు.

03/23/2017 - 08:46

మంగపేట, మార్చి 22: పురాతన విగ్రహాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఎఎస్పీ రాహుల్ హెగ్డే, మంగపేట ఎస్‌ఐ ఆరకూటి మహేందర్ తెలిపారు.

Pages