S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/23/2017 - 08:45

నిజామాబాద్, మార్చి 22: దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. అప్పటి నిజాం నవాబుల హయాంలోనే సర్వే పూర్తయనా ఈ రైల్వే లైన్ పనులు నత్తనడకన కొనసాగుతూ, ఎట్టకేలకు తుదిరూపును సంతరించుకున్నాయి.

03/23/2017 - 08:41

హైదరాబాద్, మార్చి 22: విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని, బిజెపి సభ్యులనుద్దేశించి బుధవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. దీంతో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ స్పీకర్ పోడియం వద్దకు దూసుకుని వెళ్ళగా, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ తన స్థానం వద్దే నిలుచొని నిరసన వ్యక్తం చేశారు.

03/23/2017 - 07:22

హైదరాబాద్, మార్చి 22: రాష్ట్ర శాసనసభలో మున్సిపల్ వ్యవహారాల పద్దుపై బుధవారం చర్చ జరిగిన సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, బిజెపి వాకౌట్ చేశాయి. మిషన్ భగీరథ, ఓఎఫ్‌సి కేబుల్ కలిపేస్తున్నారని, ఈ కాంట్రాక్టులో 10 వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు సభాకమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

03/23/2017 - 07:17

హైదరాబాద్, మార్చి 22: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచాల్సి ఉందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. మున్సిపల్ పద్దులపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆస్తి పన్ను పెంచకపోతే మున్సిపాలిటీలకు అవసరమైన నిధులు లభించవని, దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బంది అవుతుందన్నారు.

03/22/2017 - 03:11

హైదరాబాద్, మార్చి 21: వేద వాఙ్మయానికి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లోని భారత్ టుడే కార్యాలయానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా వచ్చి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. స్వామిజీకి పట్టు వస్త్రాలు, పూలు సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ఆయనతో గంటా 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు.

03/22/2017 - 03:05

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన విద్యాశాఖ, స్ర్తి శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమావేశంలో మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులు ఈ నిర్ణయానికి వచ్చారు.

03/22/2017 - 02:59

హైదరాబాద్, మార్చి 21: బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో 24న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వ్యూహాత్మకంగా అసెంబ్లీకి చేరుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పార్టీ పదాధికారుల అత్యవసర సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

03/22/2017 - 02:52

కీసర, మార్చి 21: మత పరమైన రిజర్వేషన్లను ఇచ్చే ప్రతిపాదనలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం బిజెవైఎం ఆధ్వర్యంలో చీర్యాల చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టరేట్‌ను కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. రామచందర్‌రావు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్ ప్రభుత్వం..

03/22/2017 - 02:48

ఖైరతాబాద్/హైదరాబాద్, మార్చి 21: హిందువులు చెల్లిస్తున్న పన్నులతో ప్రభుత్వాలు అన్యమతస్థులకు దోచిపెట్టడం ఎంత వరకు సమంజసమని పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/22/2017 - 02:46

ఉప్పల్/ హైదరాబాద్, మార్చి 21: అమాత్యుల మన్నలను పొందేందుకు ట్రాఫిక్ పోలీసులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సైరన్ మోగుతూ బుగ్గ కారు వస్తుందంటే వాటికంటే ముందే నాలుగైదు సార్లు చక్కర్లు గొట్టే పోలీసు వాహనాలు..రోడ్డుకు ఇరువైపుల ఉన్న చిరువ్యాపారులను గాబరా పెడుతూ పక్కకు తోసేయడం..అటు ఇటూ వెళ్లే వాహనాలను నిలిపివేస్తూ హంగామా చేసే పోలీసులకు బిపి పెరిగితే ఏం చేస్తున్నారో వారికే తెలియనట్లుగా వ్యవహరిస్తుంటారు.

Pages