S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/16/2016 - 04:01

మహదేవపూర్, ఆగస్టు 15: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం బెగులూర్ గ్రామమంతా జ్వరంతో బాధపడుతోంది. గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ ఒక్కరిద్దరు చొప్పన విష జ్వరాలతో బాధపడుతున్నారు. సర్కారు వైద్యం గ్రామంలో ఏర్పాటు చేసినా లాభం లేకపోవడంతో గ్రామంలోని వారు మెరుగైన వైద్యం కోసం వరంగల్, హన్మకొండ, పరకాల, భూపాలపల్లి, కరీంనగర్ పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

08/16/2016 - 04:01

హైదరాబాద్, ఆగస్టు 15: న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారి కేసులను వేంగా పరిష్కరించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపైనా, న్యాయవాదులపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్ అన్నారు. న్యాయస్థానాలను మొత్తం ప్రజల్లో 10 శాతం మంది వరకూ ఆశ్రయిస్తున్నారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

08/15/2016 - 17:57

హైదరాబాద్: నల్లకుంట పీఎస్‌ పరిధిలోని అడిక్‌మెట్‌లో సోమవారం ఉదయం కిడ్నాపైన చిన్నారి హర్షిత కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చెవి కమ్మలు తీసుకుని అంబర్‌పేటలో హర్షితను అగంతక మహిళ వదిలివెళ్లిపోయింది. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి హర్షిత అంబర్ పేటలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. హర్షితను తల్లిదండ్రులకు అప్పగించారు.

08/15/2016 - 17:48

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చే తేనీటి విందు రాజ్‌భవన్‌లో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు , కేసీఆర్‌ సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

08/15/2016 - 17:43

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధం ఉన్న నేతలు, అధికారులందరినీ అరెస్టు చేయాలని, నయీం ముఠా సభ్యులందర్నీ అరెస్టు చేయాలని మావోయిస్టు నేత జగన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

08/15/2016 - 17:39

వరంగల్‌: ఆంధ్రాబ్యాంకు ఏజీఎం కృష్ణమూర్తి నాగరాజన్‌ సోమవారం హన్మకొండ వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోల్‌కతలో తప్పుడు రుణాలు ఇచ్చి ఆంధ్రాబ్యాంకుకు ద్రోహం చేశానని తమిళనాడులోని మధురైకి చెందిన నాగరాజన్‌ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు.

08/15/2016 - 15:10

హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురం వద్ద జహంగీర్ కాలనీలో సోమవారం ఉదయం ఓ మహిళ మెడలోని గొలుసును లాక్కుని వెళ్లేందుకు కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో దుండగులు బైక్‌పై పరారయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

08/15/2016 - 13:45

మహబూబ్‌నగర్ : పుష్కరస్నానాలు ఆచరించే భక్తులతో బీచ్‌పల్లి వద్ద సోమవారం ఐదు ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. అలంపూర్ మండలం క్యాతూర్ ఘాట్, గొందిమళ్ల పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి.

08/15/2016 - 13:36

హైదరాబాద్‌ : నగర శివారు కాటేదాన్‌లోని ఆనంద్‌నగర్‌లో ప్లాస్టిక్‌ పరికరాల తయారీ కంపెనీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులు విధుల్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యుదాఘాతం వల్లనే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు,

08/15/2016 - 11:57

హైదరాబాద్‌: దసరా కానుకగా తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు పని చేస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం లుంబినీ పార్కులో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Pages