S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/31/2016 - 02:17

హైదరాబాద్, డిసెంబర్ 30: పారిశ్రామిక ఔత్సాహికతను ప్రదర్శించే విద్యార్థులకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టే ఔత్సాహిక పురస్కారాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు టి హబ్ సిఇఓ జయ కృష్ణన్ చెప్పారు. గ్లోబల్ స్టూడెంట్స్ ఔత్సాహిక పురస్కారాల సంస్థ ఈ అవార్డులను ఇస్తుంది.

12/31/2016 - 02:16

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 30: తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునేందుకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ సమ్మెలోకి వెళుతున్నారు. ఓలా, ఉబెర్ సంస్థల నిరంకుశ పోకడలకు నిరసనగా తాము సమ్మెలోకి వెళుతున్నట్టు తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

12/31/2016 - 02:16

హైదరాబాద్, డిసెంబర్ 30: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించుకున్న భూసేకరణ బిల్లు పరమ నికృష్టమైందని, రైతాంగ వ్యతిరేకమైందని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

12/31/2016 - 02:15

హైదరాబాద్, డిసెంబర్ 30: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, ప్రజల ఆరోగ్యం పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో ప్రబలుతున్న అంటు వ్యాధులు, రోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న వైద్యులపై తీసుకుంటున్న చర్యలను సభలో వెల్లడించాలని శుక్రవారం శాసన మండలిలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.

12/31/2016 - 01:58

హైదరాబాద్, డిసెంబర్ 30: పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి వినియోగించని పక్షంలో తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమల మంత్రి కె తారక రామారావు ప్రకటించారు.

12/31/2016 - 01:57

హైదరాబాద్, డిసెంబర్ 30: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఆపాల్సిందిగా హైకోర్టు ఆదేశాల మేరకు నిలిపివేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రక్రియ కొనసాగుతుండగా కొందరు హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.

12/31/2016 - 02:06

వరంగల్/ మహదేవ్‌పూర్, డిసెంబర్ 30: మావోయిస్టులు గత ఐదు దశాబ్దాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉద్యమ కార్యకలాపాలతో సాధించింది ఏమీలేదని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వనం వీడి జనంలో కలవాలని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు.

12/30/2016 - 05:19

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని సిద్దిపేట, పుల్లూరిబండ ప్రాంతాలలో మెగల్తీక్ కాలం నాటి స్మశాన వాటికలలో లభించిన ఆదిమానవుని ఆవశేషాల డిఎన్‌ఎల పరిశీలించటానికి సిసిఎంబి, దక్కన్ కాలేజిజీ ఆఫ్ పూణేలతో రాష్ట్ర పురావస్తుశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 16 ఆవశేషాలను శుక్రవారం వాటికి అప్పగించింది.

12/30/2016 - 05:16

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి..అయితే తీవ్రవాదం, ఉగ్రవాదం, సైబర్ నేరాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. గురువారం నేరాలపై జరిగిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాలపై సిట్ దర్యాప్తు తుది దశకు చేరిందన్నారు.

12/30/2016 - 05:12

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో ఈఏడాది నేరాలు తగ్గాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం క్రైంరేటు కూడా తగ్గింది. గురువారం నేరాలపై వార్షిక నివేదికలో డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా 95,124 కేసులు నమోదు అయ్యాయి. 872 హత్య, 1,138 అత్యాచార, 7,338చీటింగ్, 958చైన్ స్నాచింగ్, 50దోపిడీలు, 594 దొంగతనాలు, 753 కిడ్నాప్, 665 పిడి యాక్టు కేసులు నమోదయ్యాయి.

Pages