S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/21/2017 - 02:19

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన అధికారుల పోస్టులు, వ్యవసాయ అధికారుల పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం ప్రకటించింది. 75 ఉద్యానవన అధికారుల పోస్టులకు 73 మంది అభ్యర్ధులను, 120 వ్యవసాయాధికారుల పోస్టులకు 114 మందిని ఎంపిక చేసినట్టు కార్యదర్శి వి వాణి ప్రసాద్ తెలిపారు.

03/21/2017 - 02:18

న్యూఢిల్లీ, మార్చి 20: ‘తెలంగాణ రైతుల రుణాలు మాఫీ చేయాలి, ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలి, తెలంగాణకు కేటాయించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి’ అని లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర సమితి పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

03/21/2017 - 02:18

హైదరాబాద్, మార్చి 20: హైదరాబాద్‌లోని మంగళహాట్ పోలీస్‌స్టేషన్‌లో భీంసింగ్ అనే వ్యక్తి మరణం లాకప్‌డెత్ కాదని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో సోమవారం హోంశాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్‌సభ్యుడు రాంమోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించగా, వెంటనే హోంమంత్రి స్పందించారు.

03/20/2017 - 23:30

హైదరాబాద్, మార్చి 20: ప్రగతి భవన్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు, ఈ ఏడాది చేపట్టాల్సిన ప్రాజెక్టుల పనులపై మంత్రిమండలిలో చర్చనున్నట్టు తెలిసింది.

03/20/2017 - 23:29

హైదరాబాద్, మార్చి 20: కుల వృత్తులకు ప్రోత్సాహం అందించడంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం చేపట్టనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసన సభలో పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొర్రెల పెంపకం పథకానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కోరనున్నట్టు చెప్పారు. పశు సంవర్థక శాఖలో 489 ఖాళీలు ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

03/20/2017 - 04:37

మహబూబాబాద్, మార్చి 19: అత్యంత కిరాతకమైన ముఠా ఒకటి తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు చెందిన ముఠా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇలాంటి ముఠా రాత్రి వేళల్లో ఇళ్ల ముందు వారి వెంట ఉన్న చిన్నపిల్లలను ఏడిపిస్తుంటారు.

03/20/2017 - 04:37

వరంగల్, మార్చి 19: వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి (నిట్) చెందిన ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాంకేతిక్ కుమార్ సూర్యవంశీ ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

03/20/2017 - 04:34

హైదరాబాద్/ చాంద్రాయణగుట్ట, మార్చి 19: హైదరాబాద్‌లోని రహీంపుర ప్రాంతానికి చెందిన భీంసింగ్‌ను లాకప్‌లో పోలీసులు హింసించడం వల్ల అతను చనిపోయాడనే అభియోగాలపై న్యాయ విచారణ జరిపించాలని, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది.

03/20/2017 - 04:34

హైదరాబాద్, మార్చి 19: జాయింట్ వెంచర్ (జెవి) ప్రాజెక్టులపై విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను తక్షణం బయటపెట్టాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జెవి ప్రాజెక్టులపై ఏర్పాటైన విజిలెన్స్ విచారణ కమిటీ తన నివేదికను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి ఒక రోజు ముందు 2014 మే 31న సమర్పించిందని తెలిపారు.

03/20/2017 - 04:33

బాన్సువాడ, మార్చి 19: అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన బాధిత రైతులను ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం జహీరాబాద్ ఎంపి బిబి.పాటిల్ తదితరులతో కలిసి మంత్రి పోచారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం గ్రామ శివార్లలో వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

Pages