S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/30/2016 - 04:50

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే విధంగా ఉందని టిపిసిసి నేత మల్లు రవి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం 2014 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారన్నారు. వాస్తవానికి 2014 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదన్నారు.

12/30/2016 - 02:20

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో పాడిపరిశ్రమాభవృద్ధిపై త్వరలో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని అన్నిపార్టీలు, డెయిరీ నిపుణుల అభిప్రాయాలను స్వీకరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాగా పని చేస్తున్నారని, తెలంగాణలోని చెరువుల్లో 4కోట్లకు పైగా చేపపిల్లల పెంపకానికి అద్భుతంగా పనిచేశారని కితాబునిచ్చారు.

12/30/2016 - 02:19

హైదరాబాద్, డిసెంబర్ 29: హరితహారంను సామాజిక ఉద్యమంగా చేపట్టనున్నట్టు, గ్రామస్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం శాసన సభలో హరిత హారంపై లఘు చర్చ జరిగింది. హరిత హారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రాష్ట్రంలో హరితహారాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు.

12/30/2016 - 02:14

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుకు గురువారం శాసన మండలి ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ శాసనమండలి నుండి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. భూసేకరణ, పునరావాసం, పున: పరిష్కారంలో న్యాయమైన పరిహారం, పారదర్శక హక్కు(తెలంగాణ సవరణ)బిల్లు,2016ను నీటిపారుదల మంత్రి టి. హరీష్‌రావు కౌన్సిల్‌లో ప్రతిపాదించారు.

12/30/2016 - 02:14

హైదరాబాద్, డిసెంబర్ 29: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించి ఓ మైనర్ బాలికపై 17 రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు సినీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు.

12/30/2016 - 01:50

సికిందరాబాద్, డిసెంబర్ 29: ప్రజాసామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. 2013 భూ సేకరణ చట్టానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను విరమించుకోవాలని, బలవంతపు భూసేకరణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం తార్నాకాలోని తన నివాసంలో దీక్ష చేపట్టారు.

12/30/2016 - 01:45

హైదరాబాద్, డిసెంబర్ 29: భూసేకరణ చట్టం 2013కు ఏకపక్షంగా సవరణలు చేయడమేకాకుండా, తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ, కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం పార్టీలు గురువారంనాడు శాసనసభ సమావేశాలను బహిష్కరించాయి. కాగా విపక్షాలు సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని, తామెప్పుడూ ప్రతిపక్ష పార్టీలను అవమానించలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు.

12/29/2016 - 08:24

హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రజలకు నిత్యావసర సరుకుల విషయంలో ఏలాంటి మోసాలు జరుగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాసన మండలిలో బుధవారం స్పష్టం చేశారు. కల్తీని అరికట్టేందుకు త్వరలో సిఎం సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, కల్తీకి పాల్పడుతున్న వారు ఎంతటి వారైన వారిని వదిలేదిలేదని మంత్రి తెలిపారు.

12/29/2016 - 08:24

హైదరాబాద్, డిసెంబర్ 28:అసెంబ్లీ సమావేశాలను అవసరమైన పక్షంలో జనవరి రెండోవారం వరకు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో అన్నారు. రెండున్నరేళ్లలో మనం సాధించిన అభివృద్ధిని వివరించడానికి అవకాశం తీసుకుని ఎన్ని రోజులైనా సభ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

12/29/2016 - 08:23

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ వర్గాలకు రిజర్వేషన్లను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Pages