S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/24/2016 - 17:37

ఖమ్మం : బకెట్‌ బాంబుల పేరుతో పోలీసులను మావోయిస్టులు పరుగులు పెట్టించారు. గత రాత్రి రామచంద్రాపురం సమీపంలో వర్రెవాగు వద్ద బకెట్లు పెట్టి వాటిలో బాంబులు ఉన్నాయని చెప్పడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిమీద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.ఆగి ఉన్న బస్పుకు కూడా ఒక బకెట్‌ తగిలించి ఈ నెల 28న జరిగే మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని నినాదాలు ఇచ్చారు.

07/24/2016 - 17:32

మహబూబ్‌నగర్‌: తెలంగాణకు అనేక కంపెనీలు రాబోతున్నాయని, హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుతోందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. షాద్‌నగర్‌ దగ్గర సింబయాసిస్‌ యూనివర్సిటీని ఆదివారం కేంద్రమంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

07/24/2016 - 16:55

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.

07/24/2016 - 16:29

మెదక్: మల్లన్నసాగర్ జలాశయ పథకాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ పథకానికి భూ సేకరణను వ్యతిరేకిస్తూ కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, రైతులపై లాఠీచార్జి చేశారు.

07/24/2016 - 16:29

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని కల్చరల్ క్లబ్ వద్ద నిర్మిస్తున్న భవనానికి ఎలాంటి అనుమతులు లేవని, నాసిరకం పనుల వల్లే నిర్మాణంలో ఉండగా భవనం కూలిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదివారం విలేఖరులకు తెలిపారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు.

07/24/2016 - 16:28

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం మధ్యాహ్నం నగరంలో తెలంగాణ కెసిఆర్ అధికార నివాసంలో విందుకు హాజరయ్యారు. కేంద్ర సహాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన వంటి సమస్యలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

07/24/2016 - 14:21

హైదరాబాద్: నగరంలోని ఫిలిం నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఆదివారం కుప్పకూలడంతో ముగ్గురు కూలీలు మరణించగా ఏడుగురు గాయపడ్డారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద సుమారు రెండు నెలలుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పది పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే జిహెచ్‌ఎంసి, అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలను ప్రారంభించారు. శిథాలాల నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు.

07/24/2016 - 13:35

మహబూబ్‌నగర్‌ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లి వద్ద సింబయాసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని (ఎస్‌ఐయూ) ప్రారంభించారు. నాసిక్‌, నోయిడా, బెంగళూరులో ఇప్పటికే ఎస్‌ఐయూ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

07/24/2016 - 12:54

నల్గొండ: ఓ రైతు తన పొలాన్ని చదును చేస్తుండగా భూమిలో నుంచి కాళికాదేవి విగ్రహం బయటపడింది. నల్గొండ జిల్లా భువనగిరి మండలం సీతానగరం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీమాత విగ్రహాన్ని చూసేందుకు సమీప గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. కాళీమాత విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

07/24/2016 - 12:54

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా కొంపల్లిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కెటిఆర్ మొక్కను నాటగా, తెరాస నేతలు కేక్ కట్ చేశారు. కెటిఆర్ జన్మదినం సందర్భంగా లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మొక్కలు నాటారు.

Pages