S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/19/2017 - 04:18

మిర్యాలగూడ టౌన్, మార్చి 18: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌యార్డు సమీపంలోని రాయిని సోమనాధంకు చెందిన అక్రమంగా నిల్వ చేసిన 234.5 క్వింటాళ్ల కందులను సివిల్ సప్లయిస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం దాడులు జరిపి స్వాధీ నం చేసుకున్నారు. బి.యాదగిరికి చెందిన మడిగెలో సోమనాధం కందులను నిల్వ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించారు.

03/19/2017 - 03:44

హైదరాబాద్, మార్చి 18: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయమై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ న్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

03/19/2017 - 03:42

హైదరాబాద్, మార్చి 18: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పక్షం వహించి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం రైతులను మోసగిస్తూ దళారులు, బ్రోకర్ల పక్షాన నిలిచిందని టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం విమర్శించింది. ఎమ్మెల్యేలు వీరేశం, సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కందుల కొనుగోళ్లపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.

03/19/2017 - 03:42

వరంగల్, మార్చి 18: వరంగల్ నగరంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న ఒక మైనర్ గిరిజన విద్యార్థి ని నెలతప్పింది. ఆమెతోపాటు స్పోర్ట్స్ హాస్టల్ ఉంటున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థి దీనికి కారకుడని సమాచారం.

03/19/2017 - 03:36

హైదరాబాద్, మార్చి 18: రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో మార్క్‌ఫెడ్ ముఖ్యమైన పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. మార్క్‌ఫెడ్ అధ్యక్షుడిగా నియమితులైన లోక బాపురెడ్డి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. తనను మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా నియమించినందుకు బాపురెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.

03/19/2017 - 03:34

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక బిసి గురుకులాన్ని ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్టు బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు.

03/19/2017 - 03:29

హైదరాబాద్, మార్చి 18: దేశవ్యాప్తంగా అత్యధికంగా 1456 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రం ఛాంపియన్‌గా అవతరించిందని, మున్ముందు 5వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని విద్యుత్ శాఖా మంత్రి జి జగదీష్‌రెడ్డి చెప్పారు.

03/19/2017 - 03:27

హైదరాబాద్, మార్చి 18: మద్యం మానేసి, స్వచ్ఛమైన కల్లు తాగేలా ప్రజలను ప్రోత్సహించాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నీరా వల్ల షుగర్ మటుమాయం అవుతుందని అన్నారు.

03/19/2017 - 03:26

హైదరాబాద్, మార్చి 18: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడుల విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రికి చంద్రశేఖర్ రావు శనివారం లేఖ రాశారు. ‘ఇటీవల కాలంలో అమెరికాలో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు మీకు తెలుసు.

03/19/2017 - 03:25

హైదరాబాద్, మార్చి 18: రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏర్పాటైన ఎనిమిది జిల్లాలను కలుపుతూ ఏర్పాటైన శాసన మండలి టీచర్స్ స్థానానికి నేడు మరోసారి పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికకు విస్త్రృత ఏర్పాట్లు పూర్తి చేశారు.

Pages