S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2016 - 11:53

కరీంనగర్: దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ చిరుతపులి బావిలోపడిన ఘటన ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లిలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. బావిలో పడిన చిరుతను చూసి గ్రామస్థులు అధికారులకు సమాచారం చేరవేశారు. బావిలోనుంచి చిరుతను బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు.

05/03/2016 - 05:27

హైదరాబాద్, మే 2: మిషన్ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో నీటిపారుదల శాఖలో సిబ్బందిని డిప్యూటేషన్‌పై అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేశారు. మిషన్ కాకతీయ పనులు కొన్ని జిల్లాల్లో నత్తనడకన నడుస్తుండడంతో ఆయా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి అధికారులను డిప్యూటేషన్‌పై పంపించారు.

05/03/2016 - 05:26

హైదరాబాద్, మే 2: ఆరోగ్యశ్రీ సేవలపై ఏర్పడిన ప్రతిష్టంభనపై తెలంగాణ ప్రభుత్వం-ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య సోమవారం సచివాలయంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు అంగీకరించాయి. వైద్య మంత్రి కె లక్ష్మారెడ్డి నేతృత్వంలో జరిగిన చర్చల్లో దాదాపు 20 మంది ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు రెండుగంటలపాటు చర్చలు కొనసాగాయి.

05/03/2016 - 05:25

హైదరాబాద్, మే 2: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి పంటలకు నీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టి.పిసిసి ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. టిఆర్‌ఎస్ నాయకులు ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

05/03/2016 - 05:24

హైదరాబాద్, మే 2: డ్రైనేజీ పనిలో కూలీల మృతిపై మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయనున్నట్టు చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూలీలతో పని చేయించిన ప్రైవేటు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారు.

05/03/2016 - 05:24

న్యూఢిల్లీ, మే 2: న్యాయ వ్యవస్థతోపాటు, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుడిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఇక్కడ జంతర్‌మంతర్ వద్ద విహెచ్ ధర్నా చేయనున్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో జడ్జిలుగా బిసిలు తక్కువమందే ఉన్నారని వాపోయారు.

05/03/2016 - 05:22

హైదరాబాద్, మే 2: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) ఆధ్వర్యంలో మంగళవారం ఉపరితల బొగ్గు గనుల (ఓపెన్‌కాస్ట్) అధ్యయన యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో కొనసాగుతున్న దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

05/03/2016 - 05:22

హైదరాబాద్, మే 2: సాంకేతిక విద్య, శిక్షణ మండలి పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ప్రవేశపరీక్ష ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సాయంత్రం సచివాలయంలో విడుదల చేశారు. ఏప్రిల్ 21న నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షకు 1,27,972 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,24,747 మంది పరీక్ష రాశారని, వారిలో 1,03,001 మంది అర్హత సాధించారని చెప్పారు.

05/03/2016 - 05:21

మహబూబ్‌నగర్, మే 2: ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి పునాది పడింది. జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సోమవారం స్థానిక క్రిస్టియన్‌పల్లి సమీపంలోని ఆదర్శనగర్‌లో భూమిపూజ చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

05/03/2016 - 05:20

హైదరాబాద్, మే 2: తెలంగాణలో ప్రాజెక్టు పనులను వైకాపా నేతలకు అప్పగించడంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ల నాటకం ప్రజల ముందు బట్టబయలైందని టిటిడిపి వర్గింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Pages