S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/15/2015 - 11:37

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలి దంపతులు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

12/15/2015 - 04:25

భద్రాచలం, డిసెంబర్ 14: అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్‌పత్ ఉత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భక్తులకు నృసింహావతారంలో దర్శనమిచ్చారు.

12/15/2015 - 04:05

హైదరాబాద్, డిసెంబర్ 14: తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి సతీసమేతంగా రావాల్సిందిగా గవర్నర్ దంపతులను సిఎం కె చంద్రశేఖర్‌రావు దంపతులు ఆహ్వానించారు. సోమవారం ఉదయం విజయవాడ వెళ్లి తిరిగొచ్చిన సిఎం కెసిఆర్, భార్య శోభ, మనమడితో కలిసి సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లారు.

12/15/2015 - 03:38

హైదరాబాద్, డిసెంబర్ 14: ఎన్నికల తతంగం, మోడల్ కోడ్ ముగిసిన తరువాత రాష్ట్ర ప్రగతి, ప్రజల అజెండాను చిత్తశుద్ధితో అమలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ప్రజల అజెండా అమలుకు రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు. ఉద్యమ సమయంలో అనేక జిల్లాల్లో పర్యటించినా, ఈ మధ్య సమయం అంతగా లభించలేదన్నారు.

12/15/2015 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ నగరం సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఆర్థిక సహకారం అందించేందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీసింగ్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) ముందుకొచ్చింది. సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కంపెనీ చైర్మన్ ప్రదీప్ పూరి, వైస్ చైర్మన్ హరీష్ శంకరన్ తదితరులు సిఎం కె చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు.

12/14/2015 - 11:54

హైదరాబాద్: తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే అయుత చండీ యాగానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకొని ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు.

12/14/2015 - 11:51

హైదరాబాద్: నగరంలోని మాదన్నపేటలో 14 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు గురైనట్లు సోమవారం వెలుగు చూసింది. కిడ్నాపర్లు బాలికను ముంబై ప్రాంతానికి తరలించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/14/2015 - 11:50

నల్గొండ: బస్సుల్లో ప్రయాణీకులకు మత్తు పదార్థాలిచ్చి దోచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముఠాలోని నలుగురు సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కిలో బంగారం, 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దుగ్గల్ సోమవారం మీడియాకు తెలిపారు.

12/14/2015 - 11:49

హైదరాబాద్: స్నానం చేద్దామని చెరువులో దిగి ఇద్దరు విద్యార్థులు మరణించిన దుర్ఘటన పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో సోమవారం ఉదయం జరిగింది. మృతులను రాజేష్ (12), మురళి (13)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

12/14/2015 - 08:51

జగదేవ్‌పూర్, డిసెంబర్ 13: రాష్ట్ర సంక్షేమం కోసం ఈ నెల 23 నుంచి 27 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించే అయుత చండీ మహాయాగానికి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ యాగం శృంగేరి పీఠాధిపతులుల సమక్షంలో నిర్వహించనున్న దృష్ట్యా అన్ని వసతి సౌకర్యాలతో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Pages