S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/15/2016 - 02:32

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదివరకే రెండుసార్లు తేదీలు అనుకున్నా, ఆ తేదీల్లో సమావేశాలు నిర్వహించేందుకు వీలుకుదరలేదు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంది.

02/15/2016 - 02:31

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ‘క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. పాలసీదారులతో పాటుగా సహ వ్యక్తికీ ప్రయాణ, వసతి బీమా సదుపాయాన్ని అందిస్తోంది.

02/15/2016 - 02:30

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2016-17లో గిరిజనుల కోసం రూ.13378.5 కోట్లు కేటాయించాలని ఇఫ్లూ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇస్లావత్ రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ శోభన్ నాయక్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ సమావేశంలో ఇస్లావత్ రాజు ప్రసంగించారు.

02/15/2016 - 02:29

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బోసలెను ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నగర నూతన మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన చీఫ్ జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ దిలీప్ బోసలే మేయర్ రామ్మోహన్‌ను ప్రశంసిస్తూ మీ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

02/15/2016 - 02:28

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ తెలుగు దేశం పార్టీకి కష్టకాలం వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఇటువంటి ఆటుపోట్లను ఎన్నో తట్టుకుని నిలబడిందని, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు.

02/15/2016 - 02:28

హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్ నగర శివారుల్లో ఉన్న కాందిశీకులు (ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లిన వారి) ఎవాక్యూ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది.

02/14/2016 - 18:00

న్యూదిల్లి:జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అఫ్జల్‌గురు అనుకూల చర్యలు, భారత వ్యతిరేక నినాదాలు చేసిన సంఘటనల వెనుక లష్కరేతోయిబా అధినేత హఫీజ్ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు దేశం అంతా ఒకే వాణి విన్పించాలని ఆయన సూచించారు.

02/14/2016 - 17:59

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారంనాడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగవచ్చు. ఖమ్మంలో మొదట అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం రామదాసు, శ్రీరామ పథకాల పనులను ఆయన ప్రారంభిస్తారు. కాగా మూడురోజులుగా దిల్లీలో బిజీబిజీగా గడిపిన కెసిఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు.

02/14/2016 - 17:58

నిజామాబాద్:కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వెంకటప్పాడు తాండాలో ఓ మహిళ తన ఐదేళ్ల కుమారుడు, ఎనిమిదినెలల కుమార్తెకు ఉరివేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో గ్రామం విస్తుబోయింది. కుటుంబంలో జరిగిన గొడవలే దీనికి కారణమని భావిస్తున్నారు.

02/14/2016 - 17:12

నల్గొండ:సినీనటి ప్రణీత పెద్దప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తాపడగా సీటు బెల్టుకోవడంతో స్వల్పగాయాలతో బైటపడ్డారు. ఖమ్మంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఇన్నోవా కారులో తిరిగి వస్తూండగా నల్గొండ జిల్లా మోతెవద్ద ఎదురుగా వెళుతున్న మోటార్‌బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఆ సమయంలో కారులో ఆమెతోపాటు తల్లి, బంధువులు ఉన్నారు.

Pages