S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/16/2016 - 02:02

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్, తెలుగు దేశం, బిజెపి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనున్నది. 2014 ఎన్నికల్లో ఖేడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

02/16/2016 - 02:02

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15: నల్లగొండ జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రం ఆలయ విస్తరణలో భాగంగా ముందుగా కొండపైన నిత్యం స్వామివారి సేవ తిరిగే ప్రాంతం సమీపంలో ఎసి వద్ద బాల ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. సోమవారం కొండపైన ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

02/16/2016 - 02:01

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న 108 వాహన సిబ్బంది తిరిగి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. 108 సర్వీస్ కింద మొత్తం 1600 మంది వరకు పని చేస్తున్నారు. 108 సర్వీస్‌ను నిర్వహిస్తున్న జివికె సంస్థ సిబ్బంది సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

02/16/2016 - 02:01

మంగపేట, ఫివ్రబరి 15 : మరో రెండు రోజుల్లో జరగనున్న మేడారం జాతర కోసం భక్త జనం అప్పుడే తరలివస్తున్నారు. వన దేవతలైన సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కొంత మంది మహిళా భక్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాల వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తలనీలాల సమర్పిస్తున్నారు. మేడారం జాతరకు విచ్చేసిన భక్తజనంలో భక్త్భివం ఉప్పొంగుతుంది.

02/16/2016 - 02:00

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్‌లో సోమవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. దుండగులు బ్యాంకులో అమర్చిన సిసి కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు 60 నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒక లాకర్‌లో నాలుగు బాక్సులుంటాయి. వీటిలో ఒక బాక్స్‌ను మాత్రమే దుండగులు ఎత్తుకెళ్లినట్టు అధికారులు తెలిపారు.

02/16/2016 - 01:59

వరంగల్, ఫిబ్రవరి 15: పున్నమి వెనె్నల్లో మేడారం పులకించిపోతోంది. మహాజాతరకు ఒక రోజే సమయం ఉండడంతో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. సోమవారం దాదాపు 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాకతీయ సేనలపై కత్తి ఝుళిపించిన వీరవనితలు సమ్మక్క - సారలమ్మ జాతర కోసం కొలువుదీరే అపురూప క్షణాలు మరో 24 గంటల్లో రానున్నాయి. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులు విధుల్లో చేరిపోయారు. పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు.

02/16/2016 - 01:59

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో జరిగే అతి పెద్ద ఆదివాసీ జాతర ‘మేడారం సమ్మక్క, సారలమ్మల జాతరకు’ వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) విస్తత్ర ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

02/16/2016 - 01:58

గోవిందరావుపేట, ఫిబ్రవరి 15: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు కోటిన్నర మంది భక్తజనులు రానున్నారు. ఇందుకు తెలంగాణా ప్రభుత్వం 181 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టింది. తెలంగాణా రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్‌ఘడ్, మద్యప్రదేశ్, మహారాష్ట్ర, ఓరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు మేడారం తరలివస్తారు.

02/16/2016 - 01:58

గోవిందరావుపేట, ఫిబ్రవరి 15: సమ్మక్క-సారలమ్మ తల్లుల జాతరకు తెలంగాణా ప్రభుత్వం అన్ని ఎర్పాట్లు పూర్తి చేసిందని దేవాదాయ, గృహనిర్మాణశాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. సోమవారం మేడారంలోని జంపన్నవాగు వద్ద భక్తులతో మాట్లాడిన ఇంధ్రకరణ్‌రెడ్డి జాతర ప్రాంగణాలను పరిశీలించారు.

02/15/2016 - 14:45

హైదరాబాద్:వరంగల్ జిల్లా మేడారంలో రేపటినుంచి మూడు రోజులపాటు జరిగే మేడారం జాతరకోసం ఆర్టీసి బస్సు సర్వీసులు ప్రారంభించింది. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌తోసహా తెలంగాణలోని పలు ప్రాంతాలనుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Pages