S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/27/2016 - 06:29

హైదరాబాద్, మే 26: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది పంపుహౌజ్‌లకు, తొమ్మిది సబ్ స్టేషన్లను నిర్మించే ప్రక్రియకు గురువారం శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

05/27/2016 - 06:29

హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్ స్ట్రీంలో హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన తాళ్లూరి సాయి తేజ ఇంజనీరింగ్ స్ట్రీంలో 160 మార్కులతో టాపర్‌గా నిలవగా, మాదాపూర్‌కు చెందిన దిగుమర్తి చేతన్ సాయి 159 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు.

05/27/2016 - 06:28

బెల్లంపల్లి, మే 26: కార్మిక క్షేత్రంగా అనేక పోరాటాలకు పురిటిగడ్డ అయిన ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి నాడు సింగరేణి విధానాలతో చిన్నాభిన్నమైంది. ఇక్కడి ప్రజలు బొగ్గు గనుల మూసివేతతో చెల్లాచెదురయ్యారు. పట్టణ మనుగడ, అభివృద్ధి రాజకీయ నాయకులకు విలాస వస్తువులుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి జేబులో పెన్నుగా మారిపోయింది.

05/27/2016 - 06:26

హైదరాబాద్, మే 26: రోడ్లు, భవనాలు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తుమ్మల చేత శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, కార్యదర్శి రాజా సదారామ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తుమ్మల రెండు రోజుల కిందట తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

05/27/2016 - 06:25

నిజామాబాద్, మే 26: రాజ్యసభలో సభ్యత్వాన్ని దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కొనసాగాలనే డి.శ్రీనివాస్ కల ఎట్టకేలకు తెరాస ద్వారా నెరవేరుతోంది. ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రకటించడంతో డిఎస్ అనుచరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

05/27/2016 - 06:24

హుజూరాబాద్, మే 26: టిఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు ఖరారు కావడంతో ఆయన సన్నిహితులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ కుటుంబం మొదటి నుండి రాజకీయాల్లో ఉంది. హుజూరాబాద్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు అంకితభావంతో పనిచేస్తూ, క్రియాశీల రాజకీయాల్లో ఎదిగారు.

05/26/2016 - 18:20

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’లో స్థానం లభించింది. ఈ మేరకు లిమ్కా బుక్ ప్రతినిధులు తెలంగాణ సర్కారుకు ధ్రువీకరణ పత్రాన్ని పంపారు. సమగ్ర కుటుంబ సర్వే కింద 1.09 కోట్ల కుటుంబాల వివరాలను 4 లక్షల మంది ఉద్యోగులు సేకరించడం అరుదైన ఘనత అని వారు పేర్కొన్నారు.

05/26/2016 - 18:19

హైదరాబాద్: నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వచ్చే నెల 8, 9 తేదీల్లో ఆస్త్మా రోగులకు చేపప్రసాదం పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. ఏళ్ల తరబడి బత్తిని సోదరులు చేపప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రోగులు, వారి సహాయకులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోంది.

05/26/2016 - 16:54

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస పార్టీ గురువారం అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను రాజ్యసభకు పంపేందుకు తెరాస అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

,
05/26/2016 - 16:37

టి.ఎంసెట్ ఇంజినీరింగ్‌- టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలు
--------------------------------------------------------

Pages