S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/14/2016 - 07:14

హైదరాబాద్, : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం భూసేకరణ ప్రక్రియ చేపట్టకుండా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. భూ సేకరణలో భాగంగా తమ భవనంలో కొంత భాగాన్ని సేకరించాలన్న ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా సంస్ధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

02/14/2016 - 08:28

నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏ చిన్న సంఘటనకూ తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు అయ్యంది. దాదాపు 82 శాతం పోలింగ్ నమోదు కావడంతో, పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలమన్న లెక్కల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయ. పరిస్థితిని చూస్తే, అధికార తెరాస దూకుడు కనిపించిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

02/14/2016 - 03:21

హైదరాబాద్: తెలంగాణలో మూడు వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు చైనా హునాన్ ప్రావెన్సీ ముందుకు వచ్చింది. ముంభైలో శనివారం ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో హునాన్ ఈ ప్రతిపాదన చేసింది. 2500 నుంచి 3000వేల ఎకరాల భూమి కావాలని, వీటిలో వివిధ విభాగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించనున్నట్టు హునాన్ ప్రతినిధి బృందం తెలిపింది.

02/14/2016 - 03:18

హైదరాబాద్: టిఆర్‌ఎస్‌లో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలా? లేక వారు విలీనాన్ని కోరుతూ ఇచ్చిన లేఖపై నిర్ణయం తీసుకోవాలా? అనేది రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముందు ప్రధాన సవాల్. టిడిపి ఎమ్మెల్యేలు 10 మంది టిఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు స్పీకర్‌కు లేఖ అందజేశారు.

02/13/2016 - 15:43

మెదక్: నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ స్థానానికి శనివారం పోలింగ్ సందర్భంగా ఓటర్లు ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 73.5 శాతం మేరకు పోలింగ్ జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. టిడిపి, కాంగ్రెస్, తెరాస పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

02/13/2016 - 15:42

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ఇపుడు అమ్ముడైపోయిన ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో మంత్రి హరీష్‌రావుకు అమ్ముడుపోరన్న గ్యారంటీ ఏదీ లేదని అసెంబ్లీలో టి-టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం కుత్బుల్లాపూర్‌లో పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వందమంది కొత్తవారికి తాము టిక్కెట్లు ఇస్తామన్నారు.

02/13/2016 - 13:56

న్యూదిల్లి:కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన పరిస్థితులు, ఐపీఎస్‌ల సంఖ్య పెంచడం, హైకోర్టు విభజనవంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు. డిజిపి అనురాగ్‌శర్మ, ఎంపి వినోద్, మంత్రి జగదీశ్వర్ కేసిఆర్‌వెంట ఉన్నారు.

02/13/2016 - 02:52

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె పర్యటించారు.

02/13/2016 - 02:51

బాసర, ఫిబ్రవరి 12: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నిలయంలో వసంతపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

02/13/2016 - 02:51

హైదరాబాద్, ఫిబ్రవరి 12: చత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్‌ను ఎక్కువ మొత్తానికి కొనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు.

Pages