S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/10/2016 - 20:56

హైదరాబాద్-తెలుగుదేశం పార్టీని వీడటం బాధాకరమేనని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆయన తెరాస తీర్థం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టిడిపి బతికిబట్టకట్టే స్థితిలో లేదని, గతంలో పార్టీ నిర్ణయం మేరకు కేసిఆర్‌ను విమర్శించానని అన్నారు.

02/10/2016 - 20:16

హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భవిష్యత్‌లో బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ ఉండవని, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మున్సిపల్, పంచాయతీరాజ్, ఐటిశాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ అభివృద్ధికోసం పదిహేనురోజుల్లోగా అజెండా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

02/10/2016 - 20:15

హైదరాబాద్-తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ స్వయంగా తెలిపారు. కొద్దిసేపటి క్రితం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వారితో మాట్లాడిన మంత్రి హరీష్‌రావు వారితో కలసి ముఖ్యమంత్రి వద్దకు బయలుదేరి వెళ్లారు. అధికారికంగా వారి చేరికపై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

02/10/2016 - 17:08

హైదరాబాద్- తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గోదావరి నీళ్లతో నియోజికవర్గం కాళ్లు కడుగుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. బుధవారం నిర్వహించిన ఉపఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్, హైదరాబాద్‌లలో ప్రజలు ఇచ్చిన తీర్పు మాదిరిగానే నారాయణఖేడ్‌లోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టంగట్టాలని ఆయన కోరారు.

02/10/2016 - 11:49

నల్గొండ: బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా హామీ ఇచ్చారు. ఆయన బుధవారం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే ప్రముఖ క్షేత్రంగా యాదాద్రి రూపొందుతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.

02/10/2016 - 11:47

హైదరాబాద్: ఓ కాంట్రాక్టర్ నుంచి 1.37 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇఇ మానిక్ ప్రభు ఏసిబి అధికారులకు బుధవారం చిక్కాడు. నల్గొండకు చెందిన ఈయన గుర్రంపూడి డివిజన్‌లో పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో సైదాబాద్‌లోని ఇంటిపై కూడా పోలీసులు దాడి చేశారు.

02/10/2016 - 11:46

హైదరాబాద్: వరంగల్ జిల్లా మేడారం వద్ద జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు నగరంలోని ఎంజిబిఎస్, జెబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, నేరేడ్‌మెట్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి గంటకో బస్సును నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకూ నడుపుతారు.

02/10/2016 - 11:46

నల్గొండ: నాగార్జునసాగర్ సమీపంలో దెయ్యాలగండి వద్ద ఈ రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడగా, అందరూ క్షేమంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

02/10/2016 - 07:54

అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న మహబూబ్‌నగర్ జిల్లా, అలంపూర్‌లోని శ్రీ జోగులాంబదేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను మంగళవారం వైభవంగా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసమూర్తి, ఇఓ గురురాజ, చైర్‌పర్సన్ లక్ష్మినారాయణరెడ్డి ప్రారంభించారు. మాఘశుద్ధపాడ్యమి నుంచి మాఘశుద్ధపంచమి వరకు నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.

02/10/2016 - 06:59

హైదరాబాద్: బాల వికాస సంస్థ పేదలు, మహిళల కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఆ సంస్థకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎల్‌బి స్టేడియంలో మంగళవారం బాల వికాస సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Pages