S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/25/2016 - 05:45

హైదరాబాద్, మే 24: టి-హబ్‌లో పెట్టుబడులకు అమెరికాలోని ఇల్లినాయిస్‌లో పలు సంస్థలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు వారాల పాటు అమెరికా పర్యటనకు వెళ్ళగా, కెటిఆర్‌కు చికాగో నగరంలో తెలంగాణ ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయిద్‌తో మంత్రి సమావేశం అయ్యారు.

05/25/2016 - 05:43

హైదరాబాద్, మే 24: దేశంలోనే ఆదర్శంగా పాలమూరు ప్రాజెక్టును నిర్మించాలని, నిర్దేశించుకున్న సమయంకన్నా ముందే ప్రాజెక్టు పూర్తిచేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి మంగళవారం సమీక్ష జరిపారు.

05/25/2016 - 05:41

హైదరాబాద్, మే 24: తెలంగాణలో బోగస్ విద్యాసంస్థలు అన్నింటినీ ఏరివేసే వరకూ విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని సిఎం కె చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులే ఉండాలని, వేలంవెర్రిగా ఒకేరకమైన కోర్సుల్లో చేరడంవల్ల నిరుద్యోగం పెరిగిందని సిఎం అభిప్రాయపడ్డారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రైవేటు విద్యా సంస్థలతో సిఎం కెసిఆర్ మంగళవారం సమావేశమయ్యారు.

05/25/2016 - 05:51

హైదరాబాద్, మే 24: ఉద్యోగుల విభజన కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీనియార్టీ సమీక్ష, కారుణ్య నియామకాలపై ఇంతకాలం కొనసాగిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన కమలానాథన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తి కావడంతో వీటిపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం జీవో 1161 విడుదల చేసింది.

05/24/2016 - 18:13

హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఇక రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

05/24/2016 - 18:12

హైదరాబాద్: బోగస్ కాలేజీలు, నిబంధనలను పాటించని విద్యాసంస్థల్లో అక్రమాలను గుర్తించేందుకు పోలీస్ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తనిఖీల్లో పోలీసులు వద్దంటూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు తనను కలిసి చేసిన విజ్ఞప్తులపై ఆయన స్పందించారు. కాలేజీల్లో సౌకర్యాల కల్పనకు అవసరమైతే కొంత సమయం ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంటు పేరిట అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు.

05/24/2016 - 17:17

హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తెలంగాణ సర్కారు ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలపై ఇక ఎలాంటి ఆంక్షలు ఉండవు. లోకల్, జోనల్, మల్టీ జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి, సచివాలయ స్థాయి ఉద్యోగులకు దీంతో ఊరట లభించింది. అయితే, ఆర్థికశాఖకు మాత్రం తాజా ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

05/24/2016 - 17:16

హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలకు విద్యాశాఖ అధికారులను మాత్రమే పంపాలని, పోలీసు అధికారులను పంపవద్దని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులు సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని వారు మంగళవారం కలిసి తమ సమస్యలను విన్నవించారు. కాలేజీల్లో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

05/24/2016 - 17:15

హైదరాబాద్: నిరంకుశ నిజాం ప్రభువును ఎదిరించిన ఘనత తెలంగాణ ప్రాంతానికి ఉందని, సిఎం కెసిఆర్ ఓ లెక్కా.. అని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్ కుటుంబాన్ని జనం తరిమికొట్టే రోజులొస్తాయన్నారు. సెంటిమెంటుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జనం అదే సెంటిమెంటుతో తెరాసను గెలిపించి ఇపుడు బాధ పడుతున్నారన్నారు.

05/24/2016 - 17:13

హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో గెలిచిన తెలంగాణ ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 26న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన మంగళవారం నాడు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

Pages