S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/10/2017 - 23:41

హైదరాబాద్, మార్చి 10: శాసన సభలో మాట్లాడేందుకు సరుకు లేక ఏదో విధంగా వార్తల్లో ఉండాలని కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని, ఎలాంటి నినాదాలు చేయవద్దని గతంలో జరిగిన బిఎసి సమావేశంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పారు.

03/10/2017 - 23:40

హైదరాబాద్, మార్చి 10: శాసనసభలో 13వ తేదీన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించడానికి 12వ తేదీన మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశాన్ని మొట్ట మొదటిసారిగా సచివాలయంలో కాకుండా ప్రగతి భవన్‌లో ఈసారి ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

03/10/2017 - 02:40

హైదరాబాద్, మార్చి 9: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణ కోసం వరద కాలువ నుంచి మూడు ఎత్తి పోతల పథకాలు నిర్మించాలని మంత్రి వర్గ ఉప సంఘం భావించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి వరద కాలువపై క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం సమీక్షించింది.

03/10/2017 - 02:37

హైదరాబాద్, మార్చి 9: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిర్మొహమాటంగా నిలదీయాలని, దూకుడు పెంచాలని, విభేదాలు విడనాడి సమష్టిగా పోరాడాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై రాజీలేకుండా పోరాడాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు.

03/10/2017 - 02:34

హైదరాబాద్, మార్చి 9: శాసన సభ్యుల పనితీరుపై నియోజక వర్గాల్లో నిర్వహించిన సర్వేలో ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేలకు వివరించారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశంలో జిల్లాల వారిగా ముఖ్యమంత్రి శాసన సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యేగా ఆ నియోజక వర్గంలో ప్రజల్లో అభిప్రాయం ఏ మేరకు సానుకూలత ఉందో వివరించారు.

03/10/2017 - 02:30

హైదరాబాద్, మార్చి 9: వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా కార్యాచరణను రూపొందించుకోవాలని విద్యుత్ సంస్థలను ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. ప్రస్తుత రబీ సీజన్‌తో పాటు వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ సంస్థలతో ప్రభాకర్‌రావు గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు.

03/10/2017 - 02:28

హైదరాబాద్, మార్చి 9: సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షలు (స్కీం -2), 12వ తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు 12వ తరగతి ఇంగ్లీషు తొలి పేపర్ పరీక్ష తేలిగ్గా ఉందని, అయితే సుదీర్ఘ సమాధానాలతో సమయం చాల లేదని విద్యార్ధులు అభిప్రాయపడ్డారు. పదో తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా 8,86,506 మంది, 12వ తరగతి పరీక్షలను 10,98,891 మంది రాస్తున్నారు.

03/10/2017 - 02:24

హైదరాబాద్, మార్చి 9: కరెన్సీకి మళ్లీ కటకట ఏర్పడ్డది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఏర్పడ్డ ‘ఆర్థిక సంక్షోభం’ మళ్లీ వచ్చింది. రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎటిఎంలు పనిచేయడం లేదు. ‘నోక్యాష్’ అన్న బోర్డులు ఎటిఎంల డోర్లకు వేళ్లాడుతున్నాయి. జనం కొద్దిమొత్తం తీసుకోవాలన్నా గంటల తరబడి ఎటిఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏ ఎటిఎంలో డబ్బులు ఉన్నాయో తెలియడం లేదు.

03/10/2017 - 01:50

హైదరాబాద్, మార్చి 9: గ్రామ స్థాయి నుంచి సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం నుంచి సగటున ఏడాదికి కోటిరూపాయలు మద్యం కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు.

03/10/2017 - 01:48

హైదరాబాద్, మార్చి 9: తెలుగు సాహిత్యంలోని భిన్న ప్రక్రియల్లోనూ, నాట్యం, నాటకం, అవధానం, పత్రికారచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలితసంగీతం, జ్యోతిషం, కార్టూన్ , గజల్ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించిన 39 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది.

Pages