S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/10/2017 - 01:46

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గిరిజనులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

03/10/2017 - 01:44

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) చైర్మన్‌గా నియామకం అయిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ట్రైకార్‌కు చైర్మన్‌ను నియమించడం ఇదే మొదటిసారి.

03/10/2017 - 01:44

హైదరాబాద్, మార్చి 9: పంటల మార్కెటింగ్‌ను ఎప్పటికప్పుడు రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రూపొందించే బాధ్యతను ఎల్‌ఐఎల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఇ-పర్మిట్లు ఇచ్చేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుంటారు.

03/10/2017 - 01:42

హైదరాబాద్, మార్చి 9: నగదు రహిత లావాదేవీల నిర్వహణలో , ప్రచారంలో దేశంలోనే ఉత్తమ వర్శిటీగా జెఎన్‌టియు హెచ్ ఎంపికైంది. గత నెలలో మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేశంలోని 4500 విద్యాసంస్థలు పాల్గొనగా హైదరాబాద్ జెఎన్‌టియు విద్యార్ధులు నగదు రహిత కార్యకలాపాలను విజయవంతంగా ప్రదర్శించారు. దీంతో ఈ పురస్కారం జెఎన్‌టియు హెచ్‌కు దక్కింది.

03/09/2017 - 08:29

నర్వ, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, చిన్నారులకు కోట్లాది రూపాయలు వెచ్చించి పౌష్టికాహారం అందిస్తుంటే ఆ పౌష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పక్కదారి పడుతోంది. బుధవారం వనపర్తి జిల్లా మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద నరసింహ్మ అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్‌లో అంగన్‌వాడీ గుడ్లు ఉండడంపై ఆ గుడ్లను చూసిన ప్రజలు అవాక్కయ్యారు.

03/09/2017 - 08:28

ధర్మపురి, మార్చి 8: జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ఈనెల 8 నుండి 20వ తేదీ వరకు 13 రోజుల పాటు నిర్వహించనున్న స్థానిక దైవాల బ్రహ్మోత్సవ వేడుకలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రంలోని శ్రీయోగానంద, ఉగ్రలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల దేవాలయాలలో ప్రారంభ దిన సందర్భంగా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు.

03/09/2017 - 08:27

గోదావరిఖని, మార్చి 8: తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ మొదటి దశలో 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్ల నిర్మాణం పనులు చరుకుగా సాగుతున్నాయని, 2019 సంవత్సరం నాటికల్లా ఉత్పత్తి దశలోకి రానుందని రామగుండం ఎన్టీపీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి) వివేక్ దూబే తెలిపారు.

03/09/2017 - 08:24

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది సమయంలోనే రాష్ట్ర ఆర్థికపరిస్థితి చక్కబడిందని, శాస్ర్తియంగా పన్నులు వసూలు చేస్తుండటమే ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలపై చర్చించేందుకు బుధవారం ఇక్కడ వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది.

03/09/2017 - 08:23

హైదరాబాద్, మార్చి 8: ‘ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ జరిపిన చర్చల మతలబు ఏమిటీ?’ అని టి.జెఎసి నుంచి బహిష్కరణకు గురైన నేతలు పిట్టల రవీందర్, నల్లాల ప్రహ్లాద్ ప్రశ్నించారు. కోదండరామ్ ఎక్కే గడప, కలిపే ‘చేయి’, మొక్కే కాళ్ళు, ఎక్కే ఫ్లైట్, వెళ్ళే బ్యాంకు.. గురించి ప్రజలంతా గమనిస్తున్నారని వారు బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

03/09/2017 - 07:21

హైదరాబాద్, మార్చి 8: ‘మహిళలు పౌరుషానికి ప్రతీక..’ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కవిత అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం, మహిళలకు మంచి పోస్టింగ్‌లు ఇవ్వడం, డిగ్రీ చదివే మహిళా విద్యార్థుల కోసం జిల్లాకో వసతి గృహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం హర్షనీయమని ఆమె తెలిపారు.

Pages