S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/09/2017 - 07:19

హైదరాబాద్, మార్చి 8: శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస శాసనసభ పక్షం, శాసనమండలి పక్షాలకు దిశ నిర్దేశం చేయడానికి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో సిఎం కె చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. సమావేశానికి ఎంపీలు సైతం హాజరుకావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు.

03/09/2017 - 07:18

హైదరాబాద్, మార్చి 8: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న పలు జలాశయాల సామర్ధ్యం పెంపు వల్ల పెరుగనున్న నిర్మాణ అంచన వ్యయాలకు పరిపాలనా అనుమతి లభించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొమురవెల్లి మలన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, గంధమల్ల, బస్వాపూర్ జలాశయాలను నిర్మించనున్న విషయం తెలిసిందే.

03/08/2017 - 05:17

నల్లగొండ, మార్చి 7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం తొమ్మిదవ రోజు యాదగిరీశుడు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడవాహనంపై విహరించి భక్తులను పులకింపజేశారు. ఉదయం 10గంటలకు బాల ఆలయంలో ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో యాదగిరీశుడు పంచనారసింహుడిని మహావిష్ణువు అవతారంలో అలంకరించి ప్రియ భక్తుడైన గరుడాళ్వార్ వాహనంపై విహరింపచేశారు.

03/08/2017 - 05:15

కరీంనగర్/నల్లగొండ/జనగామ/కీసర/్భమిని, మార్చి 7: అనుకోని అతిథిలా వచ్చిన వడగళ్ల వాన ప్రజలను ఆశ్చర్యపరిచింది. మంగళవారం ఉదయం నుంచి మేఘావృతమై ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు చినుకు జాడ కన్పించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా కరీంనగర్, నల్లగొండ, జనగామ, కీసర, భీమిని తదితర ప్రాంతాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.

03/08/2017 - 05:14

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల పరిధిలో మంగళవారం జరిగిన పలు పంచాయితీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చతికిల పడిందని, టిడిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సమష్టిగా పోటీ చేసి గెలిచాయని టిటిడిపి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

03/08/2017 - 05:13

సిద్దిపేట, మార్చి 7: దేశంలోని పేదరికాన్ని రూపుమాపి, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కంకణబద్ధులై పనిచేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

03/08/2017 - 05:12

హైదరాబాద్, మార్చి 7: జర్నలిజం కోర్సును అభ్యసించే జర్నలిస్టుల సౌకర్యార్ధం 25 శాతం ఫీజు రాయితీని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి భరిస్తుందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మంగళవారం నాడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి, తెలుగు వర్శిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది.

03/08/2017 - 05:11

హైదరాబాద్, మార్చి 7: సినీ దర్శకుడు కొండ విజజయకుమార్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ మంగళవారం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. కాగా సదరు మహిళ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ కొండ విజయ్‌కుమార్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుండె జారి గల్లంతయ్యింది..

03/08/2017 - 05:10

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో ఫిబ్రవరి చివరలో, మార్చి నెలలో వడగళ్లు పడడం సాధారణమేనని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేందం శాస్తవ్రేత్త డాక్టర్ నాగరత్న తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వడగళ్ల వాన కురసిందని తెలిపారు.

03/08/2017 - 05:10

హైదరాబాద్, మార్చి 7: ఈ నెల 9వ తేదీన గవర్నర్ సమక్షంలో జరగనున్న రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశంలో తెలంగాణ విద్యుత్ సంస్ధలు రిలీవ్ చేసిన 1259 మంది విద్యుత్ ఉద్యోగుల వివాదం తేలనుంది. ఈ వివాదం 25 నెలలుగా కొనసాగుతోంది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్ధ ఎండిలు గవర్నర్ నరసింహన్‌కు నివేదికలను సమర్పించనున్నారు.

Pages